ప్రతీ ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:26 AM
రైతులు పండించిన ప్రతీధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.

మద్దిరాల,ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ప్రతీధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం, పోలుమళ్ల గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. సన్నర కం ధాన్యానికి క్వింటాకు రూ.500బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అమీనసింగ్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏవో అనిషారోహి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధాకిషనరావు, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన తీగల గిరిధర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు, నాయకులు పచ్చిపాల సుమతివెంకన్నమల్లయ్య పాల్గొన్నారు.
నూతనకల్ : ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతామని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మండలంలోని బక్కహేమ్లతండాలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటి చైర్మన తీగల గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన నాగం జయసుధాసుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివా్‌సరావు, ఎంపీడీవో సునీత, ఏపీఎం రమణాకర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : ఽరైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సామేలు కోరారు. మండలంలోని వె లుగుపల్లి,తుంగతుర్తి, సింగారంతండా గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు.
రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి ...
రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మండలకేంద్రంలో జైబాపు, జైబీమ్, జైసంవిధాన ర్యాలీని ప్రారంభించి, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, మాట్లాడారు. ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతోందన్నారు. ఆయా కార్యక్రమాల్లో తుంగతుర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన తీగల గిరిధర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య, జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన చింతకుంట్ల వెంకన్న, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్థన, జైబాపు, జైభీమ్, జైసంవిధాన యాత్ర మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్, నాయకులు ఉన్నారు.