ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: కామారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. ఏం చేశారంటే..

ABN, Publish Date - Jan 12 , 2025 | 08:09 AM

TELANGANA: కామారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని పిట్లం ఎస్‌బీఐ ఏటీఎంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని పిట్లం ఎస్‌బీఐ ఏటీఎంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ముందుగా ముసుగుతో ఉన్న దుండగుడు ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాపై స్ప్రే చేసి ముఖాలు కనపడకుండా చేశాడు. ఆ తర్వాత దొంగతనానికి దుండగులు పాల్పడ్డారు. పోలీసులకు సమాచారం తెలియడంతో అక్కడకు వెళ్లి పరిశీలించారు. దుండగుల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. తెల్లవారుజామున చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.17 లక్షల వరకు దోపిడీకి గురైనట్లు సమాచారం. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Updated Date - Jan 12 , 2025 | 08:11 AM