అభివృద్ధికి బాటలు...
ABN , Publish Date - Apr 13 , 2025 | 10:54 PM
మం చి ర్యాల నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పను లకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నాంది పల కనున్నారు.

-నేడు డిప్యూటీ సీఎం చేతులమీదుగా ప్రారంభం
-రూ. 250 కోట్లతో కరకట్టల నిర్మాణానికి ము హూర్తం
-రూ. 70 లక్షలతో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
-రూ. 400 కోట్లతో పలు పథకాలకు శ్రీకారం
మంచిర్యాల, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మం చి ర్యాల నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పను లకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నాంది పల కనున్నారు. నియోజకవర్గంలో కొత్తగా వివిధ పథకా లకు శ్రీకారం చుడుతుండగా, సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మం త్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థా పనలు చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం మధ్యా హ్నం బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండగా, అక్కడి నుంచే డిప్యూటీ సీఎం వర్చువల్‌గా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లా కేంద్రం లోని రాళ్లవాగు కరకట్ట నిర్మాణంతోపాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహావిష్క రణ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఏటా వర్షాకాలం లో పట్టణాన్ని ముంచెత్తుతున్న రాళ్లవాగు వరదలను నివారించేందుకు వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వా ల్ (కరకట్ట) నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో రూ 250 కోట్లు నిధులు ఇప్పటికే కేటాయించగా, డి ప్యూటీ సీఎం శంకుస్థాపన చేయగానే పనులు ఊ పందుకోనున్నాయి. గరిష్టంగా సంవత్సర కాలపరిమి తితో చేపట్టే పనులకు ఇప్పటికే కాంట్రాక్టింగ్ పూర్త యింది. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలోని ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వరం వరకు బ్యారేజీల్లో నీటి నిల్వ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగినప్పుడల్లా జిల్లా కేంద్రం వరద ముంపునకు గురవుతోంది. పట్టణం గుండా ప్రవహిస్తున్న రాళ్ల వాగులోకి గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో కాలనీల్లోకి వరదలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని అనేక మంది ఇళ్లు నీట మునిగి రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఎల్లంపల్లి డ్యాం గేట్లు ఎత్తిన ప్రతీసారి అప్రమత్తం గా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
రాళ్ల వాగువద్ద 7.3 కిలో మీటర్లమేర భారీ కర కట్టల నిర్మాణం చేపట్టనున్నారు. రాళ్లవాగు వరద గో దావరిలో కలిసే చోటు నుంచి ర్యాలీగడ్‌పూర్ వెళ్లే బ్రి డ్జి వరకు గోడల నిర్మాణం చేపట్టనున్నారు. వాగు గో డ ఎత్తు, స్థానికంగా వాగు లోతును బట్టి నిర్మించ నున్నారు. ఎత్తుగా ఉన్న చోట కనీసం 5 మీటర్లు ఉంటే, గోదావరిలో కలిసే చోట ఎత్తు 14 మీటర్ల దా కా ఉండనుంది. వాగుకు సమీపంలో ఉన్న ఇళ్లకు ఇబ్బంది లేకుండానే గోడ నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ....
జిల్లా కేంధ్రంలోని ఐబీ చౌరస్తాలో భారీ అంబే ద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా, అంబేడ్కర్ జ యంతిని పురష్కరించుకొని డిప్యూటీ సీఎం ప్రారం భించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చైరస్తాలో రూ. 70 లక్షల అంచనా వ్యయంతో గతంలో ఉన్న సర్కిల్‌ను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో పా ర్లమెంట్ భవనాన్ని తలిపించేలా అన్ని హంగులతో గద్దె నిర్మించారు. దానిపై అంబేద్కర్ విగ్రహాన్ని ఏ ర్పాటు చేశారు. సర్కిల్‌లో పూర్తిగా పచ్చదనం నిం పనుండటంతో చూపరులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నారు.
రూ. 11.5 కోట్లతో మహాప్రస్థానం...
జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో నిర్మిం చిన హిందూ మహాప్రస్థానం (స్మశానవాటిక)ను రా ష్ట్ర మంత్రుల చేతులమీదుగా ప్రారంభించనున్నారు. గోదావరి సమీపంలోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 11.5 కోట్ల అంచ నా వ్యయంతో చేపట్టిన మహా ప్రస్థానం నిర్మాణ ప నులు గరిష్టంగా వంద రోజుల్లోగా పనులు పూర్తికా వడం విశేషం. రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి సౌర విద్యుత్ వినియోగంతో గ్రీన్ క్రోమిటోరియం నిర్మించారు. ఒకేసారి ఎనిమిది మృతదేహాలను దహ నం చేసే విధంగా ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టగా, త్వరలో సోలార్‌తో కూడిన మరో రెండు ఎలక్ట్రికల్ దహన వాటికలను కూడా ఏర్పాటు చేయనున్నారు. దహన సంస్కారాల సమయంలో శివన్నామ స్మరణ కోసం మహా ప్రస్థానం ఆవరణలో 20 ఫీట్ల ఎత్తైన శివ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది.
డిప్యూటీ సీఎం టూర్ షెడ్యూల్....
మధ్యాహ్నం 10 గంటలకు బేగంపేట ఎయిర్ పో ర్టు నుంచి ప్రత్యేక హలికాప్టర్‌లో బయల్దేరనున్న డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు 11 గంటలకు చే రుకుంటారు. 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, స్థానిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పరిశీలనతో పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంత రం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 2.30 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.