Share News

నత్తనడకన ఆస్తి పన్ను వసూలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:49 PM

జిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూలు నత్తనడకన సాగుతోంది. మున్సిపల్‌ అధికారులు బకాయిదారు లపై కఠిన చర్యలకు పూనుకుంటున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు.

నత్తనడకన ఆస్తి పన్ను వసూలు

మంచిర్యాల సహా అన్ని మున్సిపాలిటీలది అదే తీరు

కార్పొరేషన్‌ పరిధిలో కేవలం 53శాతం వసూలు నమోదు

కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యం

90శాతం వడ్డీమాఫీతో కాస్త ఉపశమనం

మంచిర్యాల, మార్చి30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూలు నత్తనడకన సాగుతోంది. మున్సిపల్‌ అధికారులు బకాయిదారు లపై కఠిన చర్యలకు పూనుకుంటున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీమాఫీ కొంతమేర సత్ఫలితాలను ఇస్తుండగా మొత్తంగా 2024-25 ఆ ర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లలో యంత్రాంగం వెనుకబడిందని చెప్పవచ్చు. గతంలో ఆస్తిపన్ను వ సూలుకు మున్సిపాలిటిలు పెద్ద ఎత్తున ప్రచారం క ల్పించేది. ఆటోల ద్వారా మైక్‌ల్లో ప్రకటనలు ఇస్తుం డేవారు. వినియోగదారులకు మున్సిపాలిటిలు ఆస్తి పన్నుకు సంబంధించి డిమాండ్‌ నోటీసులు జారీ చే సేది. మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేయడం ద్వారా చర్యలకు ఉపక్రమించేవి. అలా ఆస్తి పన్ను వసూళ్లకు అధికారులు వివిధ ప్రయోగాలు చేసే వారు. కొంతకాలంగా వినియోగదారులకు అస లు డిమాండ్‌ నోటీసులే జారీ చేయకపోగా ప్రచారం కూడ నిర్వహించడం లేదు. కేవలం మున్సిపల్‌ సి బ్బంది ఇంటింటికి తిరుగుతూ తమ వద్ద ఉన్న కాగి తాలతో ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. దీంతో ఆశించినమేరు పన్ను వసూలుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

వినియోగదారులకు సమాచారం ఇవ్వనివైనం...

ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి ఏ వినియోగ దారుడు ఎంత పన్ను చెల్లించాలనేదానిపై వారికి అ వగాహన ఉండడం లేదు. సెల్‌ఫోన్‌లో సంక్షిప్త స మాచారం గాని నోటీసుల పంపకం ద్వారాగాని ఎంత పన్ను చెల్లించాల్సి ఉందో సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఇంటికి వచ్చే సిబ్బంది కాగితాల్లో చూపించే లెక్కలపైనే ఆధారపడి ఉండాల్సి వస్తుందనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. అదే ఇంటింటికి నోటీ సులు సరఫరా చేస్తే అందులో ఇంటి కొలతల ఆధా రంగా పన్ను విధించారోలేదో తెలుసుకునే అవకాశం వినియోగదారుడికి కలుగుతుంది. అలా చేయ కపోవడంతో ఆస్తి పన్ను వివరాలు తెలుసు కునేం దుకు మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమ వుతున్నాయి.

జిల్లాలో సుమారు 40కోట్ల బకాయిలు...

జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు క్యా తన్‌పల్లి, మందమర్రి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూ ర్‌ మున్సిపాలిటిల్లో మొత్తంగా రూ. 40కోట్ల మేర ప న్ను బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఒక మంచి ర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే రూ. 26.88 కోట్ల బకాయిలు ఉన్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 45,372 నివాస, వాణిజ్య గృహాలు ఉండగా వీటికి సంబందించి రూ.26.88 కోట్ల బకాయిలు ఉండగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటిలో 12,159 గృహాలకు గాను రూ.4.01 కోట్లు, మందమర్రి మున్సిపాలిటిలో 13,680 గృహాలకు రూ. 2.30కోట్లు, బెల్లంపల్లి మున్సిపాలి టిలో 15,408 గృహాలకు రూ.4.24కోట్లు, లక్షెట్టిపేట మున్సిపాలిటిలో 5,988 గృహాలకు రూ.1.69కోట్లు, చె న్నూర్‌ మున్సిపాలిటిలో 7,237 గృహాలకు గాను రూ. 2.86 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంది. ఆస్తి పన్ను బకా యిల్లో ఈనెల 29వ తేదీ వరకు 53శాతం వసూలు అయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటిలో పన్ను వసూల్లు నె మ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల కార్పొరేషన్‌కు సంబంధించి కరెంట్‌ డిమాండ్‌ (చెల్లిం చాల్సిన పన్ను) రూ.17.03 కోట్లు ఉండగా పాత బ కాయిలు రూ.5.59కోట్లు ఉంది. ఆస్తి పన్ను బకాయి ల వసూళ్ల కోసం మున్సిపల్‌ అధికారులు ఈ సంవ త్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సీసీనగర్‌లో ఓ ఇంటి యజమాని రూ.4వేలు పైచిలుకు బకాయి ఉండడంతో సిబ్బంది ఆయన ఇంటికి తాళం వేసి సీల్‌వేశారు. అయితే లక్ష ల్లో బకాయిలు ఉన్న వాణిజ్య సముదాయాలపై కఠి న చర్యలు తీసుకోని సిబ్బంది వేలల్లో బకాయిలు ఉన్న గృహ వినియోగదారులపై చర్యలకు పూనుకోవ డం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మంచిర్యాల కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలోని భవనంలో కొ నసాగుతున్న ఓ ప్రైవేటు కళాశాల ఆస్తి పన్ను రూ. లక్ష పై చిలుకు ఉండగా కొన్నేళ్లుగా చెల్లించినపాపా నపోలేదు. అయినప్పటికీ అధికారులు తీసుకున్న చ ర్యలు పెద్దగా ఏమిలేవు. సామాన్య ప్రజలు మూడు నాలుగువేల రూపాయలు ఉంటే తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న సిబ్బంది వాణిజ్య సముదాయాలపై దృష్టి సారిస్తే మంచిదనే విమర్శలు ఉన్నాయి.

వడ్డీ రాయితీతో సత్ఫలితాలు...

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు మున్సి పాలిటిలలో ఆస్తి పన్ను(ప్రస్తుత, పాతబకాయిలు) వసూళ్ల కోసం ప్రభుత్వం 90శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ లోపు వన్‌టైమ్‌ సె టిల్‌మెంట్‌ కింద ప్రస్తుత పన్నుతో పాటు పాత బ కాయిలు చెల్లించేవారికి రాయితీ అవకాశం కల్పిం చింది. ప్రభుత్వ ప్రకటనతో ఆస్తి పన్ను వసూళ్లు కొం త మేర సత్పలితాలను ఇస్తున్నాయి. మంచిర్యాల కా ర్పొరేషన్‌కు సంబంధించి పాత బకాయిలు రూ.5.59 కోట్లకు సంబంధించి వడ్డీ రూ.3.24కోట్లు ఉండగా క్యాతన్‌పల్లిలో రూ.0.21కోట్లు, మందమర్రిలో రూ. 0.26కోట్లు, బెల్లంపల్లిలో 0.96కోట్లు, లక్షెట్టిపేటలో 0.07కోట్లు, చెన్నూర్‌లో 0.26 కోట్ల వడ్డీ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మేరకు 90శాతం వడ్డీ రాయితీ మంచిర్యాల కార్పొరేషన్‌లో రూ.2.92 కో ట్లు, క్యాతన్‌పల్లిలో రూ.0.19కోట్లు, మందమర్రిలో రూ.0.23కోట్లు, బెల్లంపల్లిలో రూ.0.83కోట్లు, లక్షెట్టిపే టలో రూ.0.06కోట్లు, చెన్నూర్‌లో రూ.0.23కోట్లు, రా యితీ కింద వడ్డీమాఫీ కానుండడంతో ప్రజల్లో కొంత మేర స్పందన కనిపిస్తోంది. గడువు దగ్గర పడుతుం డడంతో గతవారం రోజుల్లో ఘననీయంగా పన్ను వ సూలు అయింది. ఆదివారం ఉగాది, సోమవారం రం జాన్‌ పండుగలు ఉన్నప్పటికీ ఆస్తిపన్ను వసూళ్లకు కార్యాలయాలు తెరిచే ఉంటాయన్న ప్రభుత్వ ప్రకట నతో మరికొంత మొత్తం పన్ను వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Mar 30 , 2025 | 11:49 PM