Share News

Stock Market Update: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 03:42 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతంలో ఏకపక్షంగా పడ్డాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఇండెక్సులు భారీగా కింద పడ్డాయి. అయితే, బ్యాంక్ నిఫ్టీ మాత్రం చివరి వరకూ చాలా స్థిరంగా కొనసాగి స్వల్ప నష్టాలతో బయటపడింది.

Stock Market Update: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
stock market

Stock Market : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం మిశ్రమంగా మొదలయ్యాయి మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ప్రారంభం కాగా, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకెక్స్, ఫిన్ నిఫ్టీ స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. అయితే అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో నిమిషాల వ్యవధిలో మార్కెట్లు పడటం ప్రారంభమైంది. అదే కొనసాగి చివరికి భారీ స్థాయిలో ఇండెక్సులు కింద పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ ఇవాళ నష్టాలు నమోదు చేయగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

మార్కెట్లు ముగిసే వారాంతానికి సెన్సెక్స్‌ (Sensex) 930.67 పాయింట్లు, నిఫ్టీ (Nifty) భారీగా 345.65 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా 94.65 పాయింట్లు కోల్పోయాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. జపాన్‌ నిక్కీ భారీగా 2.67 శాతం నష్టంతో ముగియగా, హాంకాంగ్‌ హాంగె సెంగ్‌ 1.55 శాతం నష్టంతో ముగిశాయి.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

AP High Court TTD Case: శ్రీనివాస దీక్షితులుకు ఏపీ హైకోర్ట్‌ షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:42 PM