Share News

Hyderabad: పనిచేసేది హోంగార్డుగా.. గ్రూపు-4లో ఉద్యోగం ఇప్పిస్తానని..

ABN , Publish Date - Apr 04 , 2025 | 09:52 AM

ఆయన పనిచేసేది హోంగార్డుగా.. కానీ గ్రూపు-4లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడు లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఉద్యోగం రావడానిరి మొత్తం రూ. 6 లక్షల ఇవ్వాలంటూ నమ్మబలికి అందులో రూ. 3 లక్షలు తీసుకున్నాడు. తీరా ఎంతకూ ఉద్యోగం రాకపోడంతో తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.

Hyderabad: పనిచేసేది హోంగార్డుగా.. గ్రూపు-4లో ఉద్యోగం ఇప్పిస్తానని..

- గ్రూపు-4లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం..

- మూడు లక్షలు వసూలు.. హోంగార్డుపై కేసు నమోదు

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) గ్రూపు-4లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒకరి నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశాడో హోంగార్డు(Home Guard). ఉద్యోగం ఇప్పించక పోగా డబ్బులు ఇచ్చిన వారినే బెదిరిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌ ప్రతాప్ సింగారంకు చెందిన జి.సునీల్‌గౌడ్‌ భార్య ధారావత్‌ భార్గవి గ్రూపు-4 పరీక్ష రాసింది.

ఈ వార్తను కూడా చదవండి: Sri Ram Navami: నవమి శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు


2012లో సునీల్‌గౌడ్‌కు వేరే ేస్నహితుడి ద్వారా హోంగార్డ్‌ డి.చంద్రప్రకాష్‌ (8284)తో పరిచయం ఏర్పడింది. గత సంవత్సరం సునీల్‌ భార్య ఏమి చేస్తోంది అని అడిగాడు. గ్రూపు-4 పరీక్ష రాసింది అని చెప్పాడు. 1:4 నిష్పత్తిలో ఎస్టీ కోటా కింద గ్రూప్‌-4లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని హోంగార్డ్‌ డి.చంద్రప్రకాష్‌ వారికి చెప్పాడు. ఉద్యోగం గురించి పైఅధికారులతో మాట్లాడతానని నమ్మబలికాడు. ఆమె విద్యార్హత పత్రాల జిరాక్స్‌ కాపీలను గత సంవత్సరం ఏప్రిల్‌ 7న తీసుకున్నాడు. మొత్తం రూ.6 లక్షలు అవుతుందని హోంగార్డ్‌ డి.చంద్రప్రకాష్‌(Home Guard D. Chandraprakash) వారితో అన్నాడు.


city5.2.jpg

దీనికి వారు సరేనని చెప్పి తమ బ్యాంక్‌ ఖాతా నుంచి అతని బ్యాంక్‌ ఖాతాకు రూ.3 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించారు. మిగీతా డబ్బుల కోసం భార్గవి నుంచి ఖాళీ చెక్కును తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న తరువాత చంద్రప్రకాష్‌ స్పందించడం లేదు. ఉద్యోగం కూడా ఇప్పించలేదు. పలుమార్లు తిరిగినా, ఫోన్లు చేసినా స్పందించక పోవడంతో మోసపోయామని గ్రహించి, గత నెల 29న సునీల్‌గౌడ్‌ పంజాగుట్ట పోలీస్‌ ేస్టషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 09:52 AM