Share News

Sri Ram Navami: నవమి శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు

ABN , Publish Date - Apr 04 , 2025 | 08:33 AM

ఈనెల 6వతేదీ ఆదివారం శ్రీరామనవమి వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అలాగే.. శ్రీరామనవమి శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Sri Ram Navami: నవమి శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు

- శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించాలి

- డ్రోన్లు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ

- అధికారులతో సమన్వయ సమావేశంలో సీపీ ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ: నగరంలో నిర్వహించే శ్రీరామనవమి(Sri Ram Navami) శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్‌(CP CV Anand) సూచించారు. శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని శాఖల అధికారులతో సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 6న ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు


శోభా యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. యాత్రలో షీటీమ్స్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్రను డ్రోన్‌లు, సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. యాత్రను మధ్యాహ్నం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ట్రయల్‌ రన్‌ చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. డ్రోన్ల వినియోగించేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. డీజేకు బదులు సౌండ్‌ సిస్టం వినియోగించుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు.


city4.2.jpg

మంగళ్‌హాట్‌ నుంచి పురానాపూల్‌, జుమ్మేరాత్‌ బజార్‌, సిద్ది అంబర్‌ బజార్‌, అఫ్జల్‌గంజ్‌, గౌలిగూడ, కోఠి, ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా మీదుగా హనుమాన్‌ వ్యాయామశాల వరకు ఓపెన్‌ టాప్‌ జీప్‌లో ప్రయాణిస్తూ రూట్‌ను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. శోభా యాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ల మరమ్మతు, లైటింగ్‌, ఇతర వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో అడిషనల్‌ సీపీ విక్రంసింగ్‌ మాన్‌, జాయింట్‌ సీపీ ట్రాఫిక్‌ జోయల్‌ డేవిస్‌, డీసీపీలు, భాగ్యనగర్‌ శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు, ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్‌, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ, జలమండలి, ఆర్టీఏ, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్‌!

మా ఆదేశాలు పాటించకపోతే.. సీఎస్‌ జైలుకే!

అకాల వర్షంతో అతలాకుతలం

రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటలపాటు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2025 | 08:33 AM