కారు యాక్సిడెంట్.. గుడిసెలో ఉన్న గర్భిణికి సుఖ ప్రసవం
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:29 PM
Car Crashes Into Pregnant Woman: ఓ కారు కారణంగా గర్భిణి సుఖంగా ప్రసవించింది. అయితే.. ఈ సంఘటనలో గర్భిణితో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పసికందు తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

త్రివిక్రమ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘ దేవుడు టాప్ మని మన చెంపమీద కొట్టి.. ఏడ్చే లోపు మన చేతుల్లో చాక్లెట్ పెడతాడు’ అని. వాస్తవానికి దేవుడి లీలలు మనుషులకు ఎప్పటికీ అర్థం కావు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో కూడా దేవుడు మనుషులకు అర్థం కాని వింత పనే చేశాడు. పాపం ఓ పూరి గుడిసెలో పేదరికంతో అల్లాడుతున్న ఓ మహిళ.. కారు యాక్సిడెంట్‌కు గురైంది. తీవ్రంగా గాయపడింది.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కారు యాక్సిడెంట్ కారణంగా మహిళ ప్రసవించింది. ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబం మొత్తం ఆస్పత్రిలో ఉన్న క్షణాన.. తల్లి ప్రాణాలతో పోరాడుతున్న సమయాన.. పాప కొత్త లోకంలోకి అడుగుపెట్టింది.
ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ గర్భిణి స్లమ్‌లోని ఓ పూరి గుడిసెలో నివసిస్తోంది. ఆమె పూరి గుడిసె బ్రిడ్జికిందే ఉంది. గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఓ కారు వేగంగా ఆ బ్రిడ్జి మీద వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందకు పడింది. నేరుగా గర్భిణి నివసిస్తున్న గుడిసెపై పడింది. 50 అడుగుల పైనుంచి గుడిసెపై పడింది. ఆ సమయంలో గర్భిణితో పాటు మరో ముగ్గురు కూడా అందులో ఉన్నారు. వారందరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. గర్భిణి కూడా గాయపడింది. ఆమె అక్కడే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
గాయపడ్డి వీరిని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు తేలింది. అయితే.. గర్భిణి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారు జువేద్ ఖాన్ అనే వ్యక్తి పై రిజిస్ట్రర్ అయినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
CBHFL Jobs: డిగ్రీ చేసిన ఉద్యోగార్థులకు జాబ్ ఆఫర్స్..45 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్
YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయుల కన్నా ఆస్తులే ఎక్కువ: వైఎస్ షర్మిలా రెడ్డి..