Share News

PV Sindhu: రోడ్డు భద్రతపై అవగాహనకు యాప్‌

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:14 AM

ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారని, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు.

PV Sindhu: రోడ్డు భద్రతపై అవగాహనకు యాప్‌

  • సర్వేజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘స్టాప్‌ యాక్సిండెట్స్‌’కు రూపకల్పన

  • ప్రారంభించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ సింధు

రాయదుర్గం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారని, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ గురవారెడ్డి సారథ్యంలోని సర్వేజన ఫౌండేషన్‌ రూపొందించిన ‘స్టాప్‌ యాక్సిడెంట్స్‌ యాప్‌’ను ఆదివారం విప్రో సర్కిల్‌ సమీపంలోని ఫీనిక్స్‌ కార్యాలయంలో పీవీ సింధు ప్రారంభించారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విప్రో సర్కిల్‌ను ప్రమాదరహిత జంక్షన్‌గా మార్చేందుకు సోలార్‌ క్యాట్‌ ఐస్‌, జీబ్రా క్రాసింగ్‌ లైన్లు, సిగ్నేచర్‌ బోర్డులు, డిలైనేటర్స్‌ ఏర్పాటు చేశారు.


డాక్టర్‌ గురవారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘స్టాప్‌ యాక్సిడెంట్స్‌ యాప్‌’ను తెచ్చామన్నారు. ఈ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, అందులోని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ప్రతి నెలా రూ.లక్ష బహుమతులు అందజేస్తామని చెప్పారు.

Updated Date - Mar 03 , 2025 | 04:14 AM