Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:42 AM
హైదరాబాద్ గోల్నాక డివిజన్‌లోని కమలానగర్‌లో శుక్రవారం ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. 19 నెలల శ్రీలక్ష్మి ఇంటి బయట ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి.

ఒళ్లంతా తీవ్ర గాయాలు.. నిలోఫర్‌లో చికిత్స
గోల్నాక, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గోల్నాక డివిజన్‌లోని కమలానగర్‌లో శుక్రవారం ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. 19 నెలల శ్రీలక్ష్మి ఇంటి బయట ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ చిన్నారి ముఖం, మెడ, చేతులు, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు నిలోఫర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం చిన్నారి నిలోఫర్‌లో చికిత్స పొందుతోంది. తీవ్రగాయాలు కావడంతో శ్రీలక్ష్మి స్పృహ కోల్పోయిందని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News