Share News

కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి

ABN , Publish Date - Apr 06 , 2025 | 05:37 AM

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రూ.6 వేల నుంచి 18 వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్‌ చేసింది. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రుణమాఫీ చట్టం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధాన ముసాయిదాను ప్రకటించాలని కోరింది.

కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి

  • తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్‌

  • 9న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని రూ.6 వేల నుంచి 18 వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్‌ చేసింది. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం, రుణమాఫీ చట్టం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ విధాన ముసాయిదాను ప్రకటించాలని కోరింది. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లను తొలగించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హేమంతరావు, పశ్య పద్మ కోరారు. రైతుల డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్‌ 9న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని, ఈ కార్యక్రమంలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

Updated Date - Apr 06 , 2025 | 05:37 AM