TGPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కోఆర్డినేటర్‌గా టీజీపీఎస్సీ
ABN, Publish Date - Jan 12 , 2025 | 04:10 AM
దేశంలోని అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (పీఎ్‌సయూ) కు కో-ఆర్డినేటర్‌గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఎంపికైంది.
పీఎస్సీల చైర్మన్ల జాతీయ సదస్సులో నిర్ణయం
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): దేశంలోని అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (పీఎ్‌సయూ) కు కో-ఆర్డినేటర్‌గా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఎంపికైంది. ఇకపై అన్ని పీఎ్‌సయూలకు సంబంధించి చట్టపరమైన సమస్యలకు టీజీపీఎస్సీ సమన్వయకర్తగా వ్యవహరించనుంది. అలాగే ఇతర రాష్ట్రాల పీఎస్సీలకు కొన్ని సబ్జెక్టులకు అవసరమయ్యే నిపుణులను కూడా ఎంపిక చేయనుంది. శనివారం బెంగళూరులో పీఎస్సీల చైర్మన్ల 25వ జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రారంభించారు.
రాష్ట్రం నుంచి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. నిరుద్యోగం పెరుగుతున్నందున ప్రభుత్వ కొలువులకు తీవ్ర పోటీ నెలకొందని, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి వేగంగా ఫలితాలు ప్రకటించడం అత్యంత కీలకాంశంగా మారిందని చెప్పారు. పీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీ సంఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా ఉండాలన్నారు. అనంతరం పీఎ్‌సయూలు అమలు చేస్తున్న అత్యున్నత విధానాలపై చర్చించారు. తదుపరి 26వ జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
Updated Date - Jan 12 , 2025 | 04:10 AM