పాలన పరేషాన!
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:46 AM
గ్రామ పరిపాలనలో పంచాయతీ కార్యదర్శులపై పెనుభారం పడుతోంది. సర్పంచ పదవీకాలం పూర్తయి ఏడాది దాటి నా ప్రత్యేక అధికారి, సెక్రటరీల సారథ్యంలో పరిపాలనా వ్యవస్థ కొనసాగుతుంది.

పాలన పరేషాన!
భారం మోసేదెవరు?
నిధుల లేమి, పని ఒత్తిడి
పంచాయతీ కార్యదర్శులపై పెనుభారం
పరిపాలనా భారం మోస్తున్న సెక్రటరీలు
తిప్పర్తి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): గ్రామ పరిపాలనలో పంచాయతీ కార్యదర్శులపై పెనుభారం పడుతోంది. సర్పంచ పదవీకాలం పూర్తయి ఏడాది దాటి నా ప్రత్యేక అధికారి, సెక్రటరీల సారథ్యంలో పరిపాలనా వ్యవస్థ కొనసాగుతుంది. ఈ తరుణంలో వచ్చే ప్రతీ ఖర్చును కూడా పంచాయతీ కార్యదర్శులే భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుండి ఏడాది కాలంగా ఎలాంటి నిధులు రాకపోవడంతో గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాజకీ య నాయకులు ఎన్ని ప్రగల్భాలు పలికినా ఆచరణ లో మాత్రం సాధ్యం కావడం లేదు. గ్రామ పంచాయతీల్లో నిధుల రాక, చేయాల్సిన పనులు చేయలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు కార్యదర్శులు. అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలు అంటూ నెలలు గడుస్తున్నా అభివృద్ధి పనులు, గ్రామ మౌలిక వసతుల కల్పనలో కార్యదర్శులు ఆర్థిక సమస్యలతో విఫలమవుతూనే ఉన్నారు. తిప్పర్తి మండల పరిధిలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా పలు గ్రామ పంచాయతీల్లో కనీసం ట్రాక్టర్లను పంచాయతీ నుంచి బయటకు కూడా తీయలేకపోతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలు మినహాయిస్తే రోజువారీగా చేయాల్సిన పారిశుధ్య పనులు కూడా చేయలేకపోతున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతుంది.
మొదటి ఆరు మాసాలు మాజీలతోనే...
సర్పంచ పదవీకాలం పూర్తయిన మొదటి ఆరు మాసాల వరకు మాజీ సర్పంచలే కొంత మేర ఆర్థికంగా ఖర్చులు చేసి పంచాయతీకి కొంతమేర సా యం అందించారు. వారు పెట్టిన బిల్లులు రాకపోవడంతో ప్రస్తుతం వారు కూడా పంచాయతీ భవనాని కి రావడం మానేశారు. వేసవికాలం సమీపిస్తుండటంతో రానున్న రోజుల్లో వాడే నీటితో పాటు తాగునీటికి ఇక్కట్లు వచ్చే అవకాశాలు రాకపోలేదు. గతేడా ది పలు గ్రామాల్లో నీటి అవసరాల మేరకు పలువు రు రైతుల వద్ద నుంచి ఒక్కో మోటార్‌కు నెలకు రూ.8వేల చొప్పున అద్దెకు తీసుకొని గ్రామానికి వా డుక నీరు అందించారు. కానీ వారికి చెల్లించాల్సిన సదరు మొత్తాన్ని ఇప్పటి వరకు వారికి ఇవ్వలేదు. దీంతో ఆయా రైతులు ఈ ఏడాది తమ బోరు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 8లక్షల మేర అద్దె మోటార్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లు సమాచారం. గత 14 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన బిల్లులు రాకపోవడం వలన గ్రా మంలో అభివృద్ధి పనులు చేయించడం కార్యదర్శులకు కత్తిమీద సాములా మారింది.
ట్రాక్టర్లు నడపలేని పరిస్థితిలో పంచాయతీలు
గత ప్రభుత్వం హయాంలో ప్రతీ గ్రామానికి ఒక ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి గ్రామంలో పల్లె ప్రగ తి పేరుతో ప్రతీరోజు చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీల్లో నిధులు ఉన్నన్ని రోజులు ఏ సమస్యలు రాలేదు. కానీ నిధులు ఎటునుంచి రాకపోవడంతో గ్రామంలో చెత్త సేకరించడం కూడా చిన్న గ్రామపంచాయతీల్లో భారంగా మారిందని పలు గ్రామాల సెక్రటరీలు వాపోతున్నారు. దీంతో స్థానికులు తమ ఇళ్లల్లోని చెత్తను గ్రామ శివారులోనే డంప్ చేస్తున్నారు. దీంతో గ్రామాలు దుర్భరంగా తయారవుతున్నాయి. కనీసం పంచాయతీలో మౌ లిక వసతులు కల్పించని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉంటే గ్రామాల్లోని ప్రజలు అనారోగ్యాల బారిన పడక తప్పదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
పంచాయతీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలి
గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరగా నిర్వహించి సర్పంచులకు బాధ్యతలు ఇస్తే తప్ప గ్రామాల్లో పూర్తి స్థాయిలో పనులు జరగవు. పంచాయతీ కార్యదర్శులు కొన్ని చోట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులను పట్టించుకోవడం లేదు. అధికారులు చొరవ తీసుకొని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలి.
పోలెబోయిన కిరణ్‌కుమార్, జంగారెడ్డిగూడెం