ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam Kumar Reddy: నెలాఖరులోగా పదోన్నతులు, బదిలీలు

ABN, Publish Date - Jan 09 , 2025 | 05:01 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో నీటిపారుదల శాఖ గాడి తప్పిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఏడాదిగా దాన్ని సరి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

  • నీటి పారుదల శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా

  • కలకాలం గుర్తుండే ప్రాజెక్టులు కట్టాలి

  • ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌/పంజాగుట్ట, జనవరి 8(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో నీటిపారుదల శాఖ గాడి తప్పిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఏడాదిగా దాన్ని సరి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. నెలాఖరులోగా అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించి, బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోస్టింగ్‌ ఇచ్చిన చోటే విధులు నిర్వర్తించాలని, పోస్టింగ్‌ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగరాదని ఇంజనీర్లకు సూచించారు. కలకాలం గుర్తుండే ప్రాజెక్టులను కట్టేందుకు కృషి చేయాలని ఉద్బోధించారు. జలసౌధలో అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ డైరీ, క్యాలెండర్‌ను బుధవారం ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంజనీర్ల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి... ఉపశమనం కల్పించే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులున్నా తనను సంప్రదించాలని, 24 గంటలూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం అనాలోచితంగా స్వల్పకాలిక వ్యవధిలో తీర్చేలా అధిక వడ్డీతో ప్రాజెక్టులకు రుణాలు తెచ్చిందని గుర్తు చేశారు. స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకుని, రుణ చెల్లింపు భారం తగ్గించుకుంటున్నామని తెలిపారు. కాగా, నాలుగేళ్లుగా టీఏ బిల్లులు విడుదల కావడం లేదని, తక్షణమే చెల్లింపులు జరిగేలా చూడాలని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కోరారు.


ఆ ఇంజనీర్లకు జీతాలు ఇప్పించండి

పోస్టింగ్‌ వచ్చినప్పటి నుంచి తమకు జీతాలు రావడం లేదని, తమ సమస్యను పరిష్కరించాలని 130 మంది ఏఈఈలు బుధవారం మంత్రి ఉత్తమ్‌ను కలిసి విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి.. సీఎస్‌ శాంతికుమారికి ఫోన్‌ చేసి, ఆ 130 మంది ఇంజనీర్ల వేతనాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరారు. కాగా, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా పోస్టింగ్‌లు పొందారన్న ఆరోపణల నేపథ్యంలో వీరికి జీతాలను నిలిపివేశారు.

Updated Date - Jan 09 , 2025 | 05:01 AM