TG NEWS: పేలిన ప్రెషర్ బాంబ్.. భయాందోళనలో జనం
ABN, Publish Date - Jan 05 , 2025 | 08:23 PM
TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ములుగు: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబా..? లేక జంతువుల వేటకు వాడే నాటు బాంబా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రెషర్ బాంబ్ పేలడంతో అంకన్నగూడెం గ్రామస్తులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి: రాజేంద్రనగర్ బుద్వేల్ రైల్వేస్టేషన్ సమీపంలోని లారీలను మరమ్మతులు చేసే గ్యారేజ్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. లారీ మెకానిక్ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వరుసగా మూడు షెడ్లకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: సీఎం రేవంత్ పచ్చి అబ్బద్దాలు మాట్లాడుతున్నారు.. కేటీఆర్ ధ్వజం
Dr. Lakshman: కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
KTR: మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్
HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jan 05 , 2025 | 08:28 PM