MLA: బడులు, గుడుల జోలికి వస్తే ఊరుకోం..

ABN, Publish Date - Jan 21 , 2025 | 09:06 AM

ప్రభుత్వం అంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఆలయాలు, పాఠశాలల కోసం స్థలం వదిలి పెట్టకపోతే ఎలా ? స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే మీ పనా అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA: బడులు, గుడుల జోలికి వస్తే ఊరుకోం..

- హౌసింగ్‌ బోర్డు అధికారుల తీరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్: ప్రభుత్వం అంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఆలయాలు, పాఠశాలల కోసం స్థలం వదిలి పెట్టకపోతే ఎలా ? స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే మీ పనా అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కేపీహెచ్‌బీ(KPHB)లోని గోవర్ధనగిరి కొండపై కల్యాణ మండపాన్ని హౌసింగ్‌బోర్డు అధికారులు సీజ్‌ చేయడంతో సోమవారం కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడికి వచ్చిన స్థానికులు సీల్‌ తొలగించేదెప్పుడు ? ఎలా అని ఎమ్మెల్యేని అడగడంతో భక్తుల మనోభావాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, సీల్‌ తొలగించే బాధ్యత ఆ వేణుగోపాల స్వామి హౌసింగ్‌బోర్డు అధికారుల కళ్లు తెరిపిస్తారని ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గుండెపోటుతో బస్టాపులో వ్యక్తి మృతి


అమ్ముకోవడం.. సొమ్ము చేసుకోవడమేనా ?

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించడం మరిచిపోయి.. ఖాళీగా ఉన్న స్థలాలు, బడులు, గుడులకు కూడా లేకుండా అమ్మి సొమ్ముచేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ముందు 10శాతం స్థలాలను హౌసింగ్‌బోర్డు ప్రజలకు చూపించిన తర్వాతనే వేలం వేయాలని, లేదంటే ఈనెల 24న జరిగే వేలం పాటను స్థానికులు, కార్పొరేటర్‌తో కలిసి అడ్డుకుంటానన్నారు. బడులు, గుడుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 100 గజాలలోపు ఉన్న స్థలాలను జీవో నంబర్‌-6 ప్రకారం వేలం కాకుండా పక్కనే ఉన్న వారికి కేటాయించాలని తెలిపారు.


మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కూడా వేలం వేసే విషయంలో పునరాలోచించాలని, ప్రజలకు చెందాల్సిన స్థలాలను అమ్ముకొని సొమ్ముచేసుకుంటామంటే చూస్తూ ఊరుకుంటామా ? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఒక్క గజం అయినా అమ్మామా? కబ్జాకోరులు, న్యాయస్థానాల్లో ఉన్న 24 ఎకరాలను కాపాడుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీకే చెందుతుందన్నారు. వేణుగోపాల స్వామికి ధూపదీప వైవేద్యాలు, ఆలయ నిర్వాహణ, భక్తుల సౌకర్యార్థం కల్యాణం మండపం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా చడీచప్పుడు కాకుండా సీజ్‌ చేయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.


జాతీయ జెండా దిమ్మె తొలగిస్తారా ?

కేపీహెచ్‌బీ ఒకటో రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగురవేసే దిమ్మెను తొలగించి కాంగ్రెస్‌ పార్టీ దిమ్మెకు జాతీయ జెండా పెట్టడంపై మాధవరం ఆగ్రహించారు. తాను సొంత నిధులతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాని ముందున్న దిమ్మెను జీహెచ్‌ఎంసీ తొలగించడం ఏంటి? వెంటనే పాత దిమ్మెను పునఃనిర్మించి జాతీయ జెండాను కట్టాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


ప్రహరీ ఎందుకు కట్టరు ?

కేపీహెచ్‌బీ రమ్యగ్రౌండ్‌ స్థలం మాది అని ఇటీవల హౌసింగ్‌బోర్డు అధికారులు బోర్డులు పాతిన విషయం తెలిసిందే. అదే గ్రౌండ్‌లో బాస్కెట్‌బాల్‌ ఆడుతున్న వైపు ప్రహరీ కూలిపోయి నెలలు గడుస్తున్నా ఎందుకు పనఃనిర్మించలేదని కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో కూడా రమ్యగ్రౌండ్‌ జీహెచ్‌ఎంసీ అని ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ బాబురావు, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ సతీష్‌ అరోరా, అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాజేష్‌ రాయ్‌, మందలపు సాయిబాబు చౌదరి, జన్నుసాయి, పాతూరి గోపి తదితరులు ఉన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 09:07 AM