ఒకేసారి 248 మంది ఔట్
ABN, Publish Date - Apr 14 , 2025 | 04:31 PM
AP Fibernet: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 248 ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించింది సర్కార్.
అమరావతి, ఏప్రిల్ 14: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ (AP Fibernet) కార్పొరేషన్‌లో ఒకేసారి 248 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. వీరిలో అత్యధిక శాతం జగన్ జమానాలో నియమితులైన వైసీపీ కార్యకర్తలే. వీరిని తీసివేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమైంది. ఏపీ ఫైబర్ నెట్ అతితక్కువ ధరకు కేబుల్, నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తూ సీఎం చంద్రబాబు విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2017 ఏపీ ఫైబర్ నెట్ అంటేనే దేశం వ్యాప్తంగా ఒక సంచలనం.
కేవలం రూ.149కే కేబుల్, నెట్, ఫోన్ సేవలు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కనెక్షన్లు తీసుకున్నారు. రెండేళ్ల పాటు ఏపీ ఫైబర్ నెట్ సేవలు బాగా అందుబాటులో ఉండటంతో ప్రజలు కూడా కనెక్షన్లు తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
Read Latest AP News And Telugu News
Updated at - Apr 14 , 2025 | 04:31 PM