Share News

తత్కాల్ టికెట్ బుకింగ్‌పై రైల్వే క్లారిటీ

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:18 PM

రైలు టికెట్ల తత్కాల్‌ బుకింగ్‌ వేళలు మారనున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన రైల్వే శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని, ఎలాంటి మార్పులు జరగలేదని స్పష్టం చేశారు.

తత్కాల్ టికెట్ బుకింగ్‌పై రైల్వే క్లారిటీ
Indian Railways clarification

Tatkal tickes: దేశంలో లక్షలాది మంది ప్రయాణీకులు రైల్వేలో ప్రయాణిస్తుంటారు. ఆఖరి నిముషంలో రిజర్వేషన్స్ (Reservations) సీట్ల కోసం ప్రయత్నించే వారు తత్కాల్ (Tatkal) ద్వారా అప్పటికప్పుడు రైల్‌లో సీట్లు రిజర్వు (Seats reserved) చేసుకుంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌పామ్‌లలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయాల్లో మార్పులు జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా ఇండియన్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. ఐఆర్‌సీటీసీ (IRCTC) తత్కాల్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు జరగలేదని పేర్కొంది. తత్కాల్, ప్రీమియమ్ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ చేసే సమయం మారాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, ప్రయాణీకులను తప్పదోవ పట్టించే ఈ విధమైన నకిలీ వార్తలను నమ్మోద్దని స్పష్టం చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: సరికొత్తగా ఇంటర్ ఫలితాలు.. వాట్సాప్‌లో కూడా..


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంటర్ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి లోకేష్

KCR: ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయాం...

For More AP News and Telugu News

Updated Date - Apr 12 , 2025 | 12:18 PM