దిండు కవర్లు ఎంత ప్రమాదమో తెలుసా..
ABN, Publish Date - Apr 12 , 2025 | 08:27 PM
దిండు కవర్ వారం రోజులపాటు వాడిన తర్వాత దానిపై 17 వేల కంటే ఎక్కువ బ్యాక్టీరియా పెరుకుపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వాడితే ప్రతి చదరపు అంగుళంలో మూడు నుంచి ఐదు మిలియన్ల వరకూ బ్యాక్టీరియా చేరుతుందని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: దిండు కవర్ వారం రోజులపాటు వాడిన తర్వాత దానిపై 17 వేల కంటే ఎక్కువ బ్యాక్టీరియా పెరుకుపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వాడితే ప్రతి చదరపు అంగుళంలో మూడు నుంచి ఐదు మిలియన్ల వరకూ బ్యాక్టీరియా చేరుతుందని తెలిపారు. ఇలా దిండు కవర్లపై పేరుకుపోయే వాటిల్లో బాసిల్లి సహా వివిధ రకాలైన బ్యాక్టీరియా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిలో కొన్ని హాని కలిగించనప్పటికీ.. మరికొన్ని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. అపరిశుభ్ర దిండు కవర్లపై అలాగే రోజుల తరబడి నిద్రిస్తే వాటిపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఫంగస్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెుటిమలు, చర్మంపై దద్దుర్లు సహా ఇతర చర్మ సమస్యలు తెస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కావున, వారం రోజుల కంటే ఎక్కువ వాడిన దిండు కవర్లను వెంటనే శుభ్రం చేసుకుంటుండాలని సూచిస్తున్నారు.
Updated at - Apr 12 , 2025 | 08:27 PM