టీటీడీపై బీజేపీ ఎంపీ ఫైర్

ABN, Publish Date - Mar 14 , 2025 | 03:54 PM

Telangana BJP MP TTD issue: టీటీడీ అవలంభిస్తున్న వైఖరి పట్ల తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

తిరుమల, మార్చి 14: టీటీడీపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పిభ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకుంటామని పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్న టీటీడీ..ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినా, పాలకమండలి నిర్ణయం తీసుకున్నా అధికారులు ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు.


తెలంగాణ ప్రజాప్రతినిధులు పట్ల టీటీడీ వివక్ష తగదన్నారు. పాలకమండలి అత్యవసరంగా సమావేశమై నిర్ణయం అమలు చేయాలని కోరారు. వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు ఇస్తామని.... వాటిని పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరు తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని అన్నారు. వెంటనే సిఫార్సు లేఖలపై పాలకమండలి నిర్ణయం తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Holi celebration controversy: హోలీ సంబరాల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 14 , 2025 | 03:56 PM