Home » Andhra Pradesh » West Godavari
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది. తాజాగా, 8 మంది వైసీపీ సర్పంచులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు.
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడిప్పుడే ఆరంభమై ఊపం దుకుంటున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశకు నిధులొచ్చాయి.
సనాతన ధర్మంలో భాగంగా హిందూ ధర్మం పెంపొందించడానికి శనివారం మండలంలోని భీమలాపురం, వల్లూరుకు చెందిన సుమారు 500 మంది కోలాట భజన సభ్యులతోపాటు మరికొంత మంది హిందూభక్తులు కలిసి భారీ ర్యాలీగా అప్పన్నప్పల్లికి పాదయాత్రగా తరలివెళ్లారు.
రాయకుదురులో ఉన్న ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీకమాసం సందర్భంగా శనివారం నుదురుపాటి కోదండరామమూర్తి, సీతామహాలక్ష్మి, వేద పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. పార్వతి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, మల్లేశ్వర స్వామికి శాంతి కల్యాణం నిర్వహించారు.
ఓ చేపల చెరువు రైతు వద్దకు పనిచేయడానికి వచ్చిన వ్యక్తి ఆ రెతు స్థితిగతులను తెలుసు కున్నాడు. ఆ రైతు అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నాడు.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాల్టీలు, ఆసుపత్రుల విద్యుత్ బకాయి లు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ హయాం లో ఐదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో రూ. 205.49 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు లెక్క తేల్చారు.
డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళల ఆర్థిక అభ్యున్నతికి వ్యాపార సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన(పీఎం అజయ్) కింద రూ.50 వేలు సబ్సిడీతో రుణాలు మంజూరుచేస్తారు.
నరసాపురం తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల అసం తృప్తి రాజుకుంటున్నది. సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
చుట్టూ గోదావరి జలాలు వున్నా జిల్లా వాసులకు సురక్షిత నీరు కరువు. కాల్వలన్నీ కలుషితం. దాహార్తి తీర్చుకోవడానికి సురక్షితమైన నీటి కోసం ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. దీనిని అధిగమించేందు కు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాటర్గ్రిడ్ ప్రాజె క్ట్కు శ్రీకారం చుట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి నిధులు కేటాయించలేదు.
ప్రసిద్ధ ఆచంట ఉమా రామేశ్వరస్వామి ఆలయంలో వేలాది మంది భక్తుల శివనామస్మరణ మధ్య శుక్రవారం సాయంత్రం అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలన జరిగింది.