Home » 2024
సమస్యలను పరిష్కరించాలని బా ధతులు కలెక్టరేట్కే క్యూకట్టారు. గతవారం జిల్లాకేంద్రంలోని డీఆర్డీఏ కార్యా లయంలో అనంత రెవెన్యూ డివిజన గ్రీవెన్స మొదలు పెట్టి, కలెక్టరుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీంతో గత సోమ వారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి గ్రీవెన్సకు కేవలం112అర్జీలు మా త్రమే వచ్చాయి.డివిజన స్థాయి గ్రీవెన్సకు 290వరకు వచ్చాయి.
నగర పాలక సంస్థ పరిధిలోని కమలానగర్లో పారిశుధ్య నిర్వహణ లోపంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ పేరుతో దగ్గుపాటి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు సోమవారం ఉదయం 7 గంటల నుంచి స్థానిక కమలానగర్లో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదోరోజు సోమవారం జిల్లా వ్యాప్తం గా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. జిల్లాకేంద్రంలో గుల్జార్ పేటలోని కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత మూలవిరాట్ను నవధాన్యాలతో, ఆల య ఆవరణలో ఉత్సవమూర్తులను శైలపుత్రిదేవి, గాయత్రిదేవి, సిద్ధిధాత్రి దేవిగా అలంకరించారు.
అసలే అమెరికా ఎన్నికలు.. అందులోనూ వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు చేసే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ మరోసారి పోటీ..! ఆయనకు అపర కుబేరుడు, సామాజిక మాధ్యమం ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ మద్దతు..!
రైతులకు నాణ్యమైన విద్యుతను అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పరిటాల సునీ త పేర్కొన్నారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత విద్యు త శాఖాధికారులపై ఉందన్నారు. చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలలా రైతు లకు మంజూరైన వ్యవసాయ ట్రాన్సఫార్మర్మలను పంపిణీ చేశారు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని భావించి 2014లో టీడీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆదా యాన్ని పెంచేందుకు చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించింది. స్వచ్ఛభారత కింద ఉపాది హామీ పథకంలో భాగంగా ఒక్కో కేంద్రం నిర్మా ణానికి దాదాపు రూ.10లక్షల వరకు ఖర్చు చేశారు.
అనంతపురం నగరంలోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో మరణాలు వివాదాస్పదం అవుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, శిశువుల సహా పలువురు సరైన వైద్యం అందని కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు ఆస్పత్రుల వద్ద ఆందోళనలు నిర్వహిస్తేగానీ ఇలాంటివి బయటకు రావడం లేదు. ఆస్పత్రుల్లో అసౌకర్యాలు, అనుమతి లేని వైద్యం, కన్సల్టెంట్ వైద్యులపై ఆధారపడి ఆస్పత్రుల నిర్వహణ.. ధనదాహం, నిర్లక్ష్యం.. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో ఈ మరణాల వెనుక ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ తరచూ ఆస్పత్రులలో మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఎక్కడా ...
ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆదివారం వైకుంఠవాసుడు సర్వ భూపాల వాహనంపై ఊరేగుతూ కనువిందు చేశారు. ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలవి రాట్లకు ఉదయం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వ హించారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ఆది వారం అమ్మవారు జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో దర్శనమి చ్చారు. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని వివిధ ఆలయాల్లో అమ్మ వార్ల మూలవిరాట్లతో పాటు ఉత్సవమూ ర్తులను ప్రత్యే కంగా అలంకరించి విశేష పూజా కార్య క్రమాలు నిర్వహించారు.
జిల్లాలోని 28 మండలాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బొమ్మనహాళ్ మండలంలో 148.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. గార్లదిన్నె మండలంలో 75.8, రాయదుర్గం 75.6, పామిడి 62.2, డి. హీరేహాళ్ 59.8, బెళుగుప్ప 56.2, విడపనకల్లు 54.6, కణేకల్లు 54.0, కళ్యాణదుర్గం 50.4, శింగనమల 48.6, పెద్దవడుగూరు 40.6, గుమ్మఘట్ట 36.2, ...