Home » aap party
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ దాడి చేసిన వారం తర్వాత, ఢిల్లీ పోలీసులు(delhi police) దర్యాప్తునకు మరో అడుగు ముందుకు వేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్(SIT)ను ఏర్పాటు చేశారు.
కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి శుక్రవారం విడుదలైన కేజ్రీవాల్ శనివారం ఆప్ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
పార్టీ స్థాపించి అతితక్కువ కాలంలోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆప్. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. ఎన్నికలలో వినూత్నంగా ప్రచారం చేసి.. సక్సెస్ సాధించడంలో అరవింద్ కేజ్రీవాల్ ముందువరుసలో ఉంటారు. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి ఆయన ప్రచార వ్యూహం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజలందరినీ ఆకర్షించేలా ప్రచారం చేయడంలో ఆయన ముందుంటారు.
లోక్‌సభ 2024 ఎన్నికలకు(lok sabha election 2024) ముందే కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్(Delhi Congress president) అరవిందర్ సింగ్ లవ్లీ(Arvinder Singh Lovely) తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధికారులు ఆదివారం ఈ మేరకు వెల్లడించారు.
జైల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరణానికి చేరువ చేసే చర్యలు జరుగుతున్నాయని ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. తమ నాయకుడు కేజ్రీవాల్ టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఆయనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు జైలు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Case ) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ను వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది రూస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్‌ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఇప్పటికే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను అరెస్టు చేసిన ఈడీ మరికొందకు ఆప్ నేతలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైంది.