Home » ABN
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) నేటి (బుధవారం) ‘బిగ్ డిబేట్’ చర్చలో గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్కే గారూ సంధిస్తున్న ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. ఈ చర్చా కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించండి.
పశ్చిమ బెంగాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికలు ( Lok Sabha Elections 2024 ) జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య ( Ayodhya ) బాల రాముని ఆలయంలోని మూల విరాట్ నుదుటిపై సూర్యకిరణాలు పడే విధంగా సూర్య తిలకం ఏర్పాటు చేశారు. సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కటకాలు, దర్పణాల ద్వారా పరావర్తనం చెందించి రాముడి విగ్రహాన్ని తాకేలా రూపొందించారు.
శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో రాం లల్లా కొలువుదీరిన తరువాత ఇదే తొలి రామనవమి అని అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు.
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం.
చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సంచలన ప్రకటన చేశారు. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విచ్చలవిడితనం పేట్రేగిపోతోంది. తన మన అనే తేడా లేకుండా కొందరు అక్రమాలు, నేరాలకు ( Crime ) పాల్పడుతున్నారు. ఇంకొందరు విహహేతర సంబంధాల ఉచ్చులో బందీ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎన్నికల ప్రచారంతో హీటెక్కిస్తున్నారు. శ్రీకాళహస్తిలో చేపట్టిన ప్రచారంలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.
సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ( CM YS Jagan ) ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.