Home » ACB
సింగిల్ విండో అవినీతి గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా పని చేస్తూ సస్పెండైన ఓ వ్యక్తి.. దీనికి తెర తీశాడు. తన పై అధికారుల తరఫున కూడా ఆయనే రేటు మాట్లాడి అనుమతులు మంజూరు చేయించేవాడు. ఏసీబీ సోదాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అవినీతి కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఇరిగేషన్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నిఖేశ్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తాజాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.
వైసీపీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళి ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా విశాఖపట్నం మహానగరం రూపాంతరం చెందింది. అలాంటి ఈ నగరం రోజు రోజుకు విస్తరిస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ప్రభుత్వం అనుమతిచ్చింది.
Telangana: గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది. సీజన్-9 ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్కో రూ.150కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి.
విద్యుత్ చౌర్యం ఘటనలో కేసు లేకుండా చేసేందుకు ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లైన్ఇన్స్పెక్టర్ జిలుగు నాగరాజు ఏసీబీకి చిక్కాడు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎం. వెంకట భూపాల్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు.
పెండింగ్ బిల్లులను విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న వనపర్తి జిల్లా పెబ్బెరు మునిసిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషును ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.
Andhrapradesh: ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏ-1 గా వెంకటరెడ్డి, ఏ2 గా జేపీ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారామ్ కామత్, ఏ3 గా ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధి పి.అనిల్ కుమార్, ఆర్.వెంకట కృష్ణారెడ్డి, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి, ఏ4గా ఏసీబీ కేసు నమోదు చేసింది.
వెంకటరెడ్డి పట్టుబడ్డారా లేక లొంగిపోయారా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే పెద్ద ప్రశ్న. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. వెంకట రెడ్డిని శుక్రవారం వేకువజామున బెజవాడకు తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నంలోపు కోర్టులో ప్రవేశపెట్టి విచారణ నిమిత్తం ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.