Home » Agriculture
‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తొందరగా ఓవర్ టేక్ చేయాలని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి ఉండొచ్చు! అందుకోసం మాపై అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? రూ.1.30 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నడు.
వజ్రకరూరు మండలంలోని గూళ్యపాళ్యంలో వ్యవసాయ మోటారుకు మీటరు ఏర్పాటు చేయడాన్ని రైతు విరుపాక్షి అడ్డుకున్నారు. విద్యుత స్తంభం వద్ద విద్యుత మీటరును అమర్చడానికి సిబ్బంది రాగా మోటారు బాక్స్‌ను...
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భూ సర్వే పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు కావాలి?
పదేళ్ల పాలనలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నందునే ప్రజలు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావును ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మొరుగుతున్నారని తాను అంటే, దానిని హరీశ్ వక్రీకరించి, రైతులను ఉద్దేశించి అన్నట్లుగా చెబుతున్నారని తుమ్మల తెలిపారు.
పంద్రాగస్టును రుణమాఫీకి డెడ్‌లైన్‌గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం లాంటి వారని.. ఆయనపై ఇంక్ చల్లవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఉత్తమ్ మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు.
రైతులకు ఇనఫుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అరకొర సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకుందని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని దేవగిరిక్రాస్‌లో గురువారం టీడీపీ నాయకుడు మల్లీడు శ్రీనివాసులు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలవ మాట్లాడారు.
ఈ సమస్య కేవలం ఈ మూడు గ్రామ పంచాయతీలది మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలూ ఎదుర్కొంటున్నాయి. నాలుగు నెలలుగా కేంద్రం నిధులు రావడం లేదు. ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రెండేళ్లలో అప్పుడప్పుడు ఇచ్చినప్పటికీ.. 16 నెలలకు పైగా రావాల్సి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి సకాలంలో నిధులు విడుదలైతేనే.. చిన్న పంచాయతీల నిర్వహణ భారంగా ఉంటుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని గతంలో కేసీఆర్ ప్రచారం చేయగా దొడ్డు బియ్యం సాగు చేస్తే గడ్డుకాలమే అనేలా ఇప్పుడు రేవంత్ చేస్తున్నారని విమర్శించారు. కల్లాల్లోకి పంట వచ్చిన వంద రోజుల్లోగా బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు
కేసీఆర్ పాలనలో పంటల బీమా పథకం అమలుకు నోచుకోలేదని, తాము రూ.3వేల కోట్లతో ఆ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. రాష్ట్రంలో సన్న రకాల సాగును పెంచేందుకే రూ.500 బోనస్ ప్రకటించామని తెలిపారు.