Home » Agriculture
రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రంలో రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తిరిగివ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాల ఎత్తిపోతలను సోమవారం ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు.
రైతులకు సమయానికి ఎరువులు అందేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.
విప్లవాత్మక కార్యాచరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తూ ప్రతిపాదనలతో ఆగిపోయిన అంశాన్ని పరిష్కరించనుంది. వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి నిధులను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానం రైతుల జీవితాల్లో కొత్త వెలుగు నింపనుంది. పంచాయతీల్లో శుక్రవారం జరిగే గ్రామ సభలు.. రైతుల ఆకాంక్షలకు బాసటగా నిలవనున్నాయి.
వ్యవసాయ రుణాలు మాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిగ్గు తేలుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆయిల్పామ్ కంపెనీలు వెంటనే ఫ్యాక్టరీల నిర్మాణాలు చేసి, ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ మొదలుపెట్టేలా కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం కలెక్టర్ శ్యారమ్పసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా గొరడ గిరిజన గ్రామంలో రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు.
వ్యవసాయంలో నష్టాలు రావడంతో సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు, కరెంటు షాక్తో ఇద్దరు అన్నదాతలు చనిపోయారు.