Home » AICC
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు.
ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ( KC Venugopal ) తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ( Anumula Revant Reddy ) గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ముఖ్య నేతలు వచ్చారు.
Telangana: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. తాజ్‌కృష్ణ హోటల్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఏఐసీసీ నేతలు ఎల్బీస్టేడియానికి చేరుకున్నారు.
Telangana: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకరమహోత్సవానికి ఏఐసీసీ పెద్దలు హాజరుకానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధఈ, ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల కాన్వాయ్ తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ముగ్గురు అగ్రనేతలకు కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
తెలంగాణ సీఎం, సీఎల్పీ నేత, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌కి చేరుకున్నారు. స్పీకర్ ఓం బిర్లా ( Speaker Om Birla ) ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు.
సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును హై కమాండ్ ఖరారు చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులతో కూడిన క్యాబినేట్ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు.