Share News

Allu Arjun: శ్రీతేజ్‌కు పరామర్శపై పునరాలోచించండి

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:30 AM

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించే విషయమై పునరాలోచించాలని హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్‌ పోలీసులు నోటీసిచ్చారు. ఆయన రాకతో ఆస్పత్రి కార్యకలాపాలకు, ఇతర రోగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.

Allu Arjun: శ్రీతేజ్‌కు పరామర్శపై పునరాలోచించండి

  • హీరో అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసు

  • ఆస్పత్రిలో పేషెంట్లకు ఇబ్బంది అని వెల్లడి

  • చిక్కడపల్లి ఠాణాలో అల్లు అర్జున్‌ సంతకం

  • విస్తృత బందోబస్తుతో స్థానికులకు ఇబ్బంది

రాంగోపాల్‌పేట్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించే విషయమై పునరాలోచించాలని హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్‌ పోలీసులు నోటీసిచ్చారు. ఆయన రాకతో ఆస్పత్రి కార్యకలాపాలకు, ఇతర రోగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. అయినా ఆస్పత్రికి వెళ్లాలని భావిస్తే.. ఆస్పత్రి వర్గాలతో, తమతో సమన్వయం చేసుకోవాలని.. తమ సూచనలను పాటించాలని సూచించారు. ఏదైనా జరగరానిది జరిగితే అందుకు అల్లు అర్జునే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శ్రీతేజ్‌ ప్రస్తుతం సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అతణ్ని పరామర్శించడానికి అర్జున్‌ వెళ్లాలనుకుంటున్నట్టు సమాచారం అందడంతో.. రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌ ఎస్సై నర్సింగరావు నేతృత్వంలోని పోలీసులు జూబ్లీహిల్స్‌లోని అర్జున్‌ నివాసానికి వెళ్లారు.


అయన అందుబాటులో లేక పోవడంతో మేనేజర్‌కు నోటీసు అందజేశారు. ఇక.. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్‌ ఆదివారం చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి సంతకం చేశారు. అర్జున్‌కు షరతులతో కూడినసాధారణ బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం.. ఎనిమిదివారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10.30 గంటలకు చిక్కడపల్లి పీఎ్‌సకు వెళ్లి సంతకం చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఠాణాకు చేరుకున్న బన్నీ సంతకం చేసి 10.45 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. అల్లు అర్జున్‌ రాక సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే భక్తులనూ అనుమతించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరుఅ భిమానులు యూట్యూబ్‌ చానళ్ల పాత్రికేయుల పేరు తో మీడియా రిపోర్టర్లలో కలిసిపోయారు. అల్లు అర్జున్‌ వెళ్లిపోయేటప్పుడు.. ‘జై బన్నీ..’ అంటూ నినాదాలు చేశారు.

Updated Date - Jan 06 , 2025 | 03:30 AM