Home » Allu Arjun
మొదట అల్లు అర్జున్‌కు 18 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు..
సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు మరోసారి సంధ్య థియేటర్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరైన ఆయనను సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందడం కలకలం రేపింది. ఈకేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
సినీ హీరో అల్లు అర్జున్ మామ.. కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మెరిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కలిసి మాట్లాడారు.
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీఅధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
పోలీసు అధికారి బట్టలూడదీసిన సినిమాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ఇచ్చిందని, ఇది దేనికి సంకేతమని మంత్రి ధనసరి సీతక్క ప్రశ్నించారు. బాధ్యతాయుత స్థానంలో ఉండే పోలీసు అధికారి హేళన అయ్యాడని, స్మగ్లర్ హీరో అయ్యాడని వ్యాఖ్యానించారు.
మధ్యంతర బెయిల్‌పై ఉన్న నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు మంగళవారం మరోసారి విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను.. ఆ చిత్ర నిర్మాత యెర్నేనీ నవీన్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.
హీరో అల్లు అర్జున్‌తోపాటు టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం లేదన్నారు. అయినా అల్లు అర్జున్, సినిమా ఇండస్ట్రీతో తమకు వైరం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.