Home » Amaravati
సికింద్రాబాద్-రేపల్లె మధ్య నడిచే రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు ఇక చర్లపల్లి నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఏర్పడ్డ ఒత్తిడి కారణంగా సికింద్రాబాద్ కు బదులు చర్లపల్లికి మార్చినట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాఢవీధులలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు.
హైదరాబాద్-అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రూపకల్పన చేసి.. సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు-ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణాల నేపథ్యంలో కోటి టన్నుల ఇసుక నిల్వలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు గనుల శాఖను ఆదేశించారు. అమరావతితో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు ఇసుక అవసరమవుతుందని పేర్కొన్నారు
అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమిపూజ నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు
అమెరికా సుంకాల ప్రభావం దృష్టిలో ఉంచుకుని, ఆక్వా రంగ సమస్యలపై ప్రభుత్వంపై కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీ తక్షణ, మధ్య మరియు దీర్ఘకాలిక పరిష్కారాలపై నివేదికలు సమర్పించనుంది.
AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. అమరావతి రహదారులకు సంబంధించిన టెండర్లను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పిలిచింది.
సింగపూర్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఆస్పత్రి వద్దే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉన్నారు. ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాసకు ఇబ్బంది కావడంతో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేశారు. వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం 8.51 గంటలకు వేద పండితులు వారి చేత భూమి పూజ చేయించారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని చంద్రబాబు కొనుగోలు చేశారు.సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.