Share News

AP Government: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:43 PM

AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. అమరావతి రహదారులకు సంబంధించిన టెండర్లను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పిలిచింది.

AP Government: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు
Amaravati Development

అమరావతి: రాజధాని అమరావతి రాచమార్గాలకు లైన్ క్లియర్ అయింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ E -13, E -15 రోడ్లకు టెండర్లు పిలిచింది. E-13 రోడ్‌కు రూ. 384 కోట్లు, E-15 రోడ్‌కు రూ.70 కోట్లతో టెండర్లను పిలిచింది. సీడ్ యాక్సెస్ రోడ్‌కు ఉండవల్లి నుంచి ప్రత్యామ్నాయంగా ఈ రెండు రోడ్‌లను ముందు నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధానికి జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడుతోందని అధికారులు భావించారు. ఎయిమ్స్ పక్క నుంచి రెండు రహదారులను నిర్మించి జాతీయ రహదారికి కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్గాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు, రిజర్వ్ ఫారెస్ట్, రైతులు స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించారు. దీంతో వెంటనే ఈ రెండు రోడ్‌లను 24 నెలల్లోపు నిర్మించాలని టెండర్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు.


ఆదాయ వనరులు పెరగాలి: సీఎం చంద్రబాబు

ఏపీకి సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన అభివృద్ధి అని సీఎం చంద్రబాబు తెలిపారు. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువుగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రసీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని సీఎం చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Trump China Tariffs: చైనాపై ట్రంప్‌ బాదుడు 104 శాతానికి!

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Big Shock To Kakani: కాకాణి బెయిల్.. నో చెప్పిన హైకోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 06:50 PM