Mega Draw: ఖమ్మం వాసికి మారుతి స్విఫ్ట్ కారు
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:11 AM
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు.

డ్రా తీసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ‘ఆంధ్రజ్యోతి’ విధానాలు ఆదర్శమని ప్రశంస
హైదరాబాద్ సిటీ/బోనకల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ కార్ అండ్ బైక్ రేస్ మెగా డ్రాలో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చెందిన గుడిపూడి శ్రీనివాసరావు మారుతి స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ఆంధ్రజ్యోతి’ కార్ అండ్ బైక్ రేస్ మెగా డ్రా కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన లక్షకుపైగా కూపన్ల నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి డ్రా తీశారు. అనంతరం విజేతకు ఫోన్ చేశారు.
పుట్టెడు వడ్ల లాగా కుప్పపోసిన లక్షల కూపన్లలో మీరు విజేతగా నిలవడం అదృష్టమంటూ గుడిపూడి శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని పాఠకులకు ఏటా లక్కీ డ్రా నిర్వహిస్తూ బహుమతులు అందజేస్తూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తరహా బహుమతులు అందజేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి, సంస్థ ఎండీ రాధాకృష్ణకు మనస్ఫూర్తిగా అభినందలు తెలిపారు. అద్భుతమైన విధానాలతో ఇదే తరహాలో భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని పొంగులేటి ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్ వర్క్ ఇన్‌చార్జ్ కృష్ణప్రసాద్, స్టేట్ బ్యూరో ఇన్‌చార్జ్ మురళీకృష్ణ, సర్క్యులేషన్ డీజీఎంలు మూర్తి, ప్రసాద్.. అడ్వర్టైజ్‌మెంట్ జీఎంలు శివప్రసాద్, శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.
కారు లేని లోటును ‘ఆంధ్రజ్యోతి’ తీర్చింది
మాకు కారు లేని లోటును ‘ఆంధ్రజ్యోతి’ తీర్చింది. నాకున్న పదెకరాల భూమితో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్లుగా ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను చదువుతున్నాను. లక్కీ డ్రాలో విజేతగా నిలవడం గొప్ప అనుభూతినిచ్చింది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. మాకు ఇది నిజమైన పండుగ రోజు. ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక చదవడంతోనే ఇంత గుర్తింపు వచ్చింది.
- విజేత గుడిపూడి శ్రీనివాసరావు