Home » AP Assembly Budget Sessions
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు.
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ(సోమవారం) ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్6 పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతోపాటు రాష్ట్రంలోని చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది.
గ్రామ సమీపంలోని రామాలయంలోకి తాము ప్రవేశించరా దని కొంత మంది ఆంక్షలు పెడుతు న్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని పీలేరు మండలం వేపులబైలు పంచా యతీ రెడ్డివారిపల్లె సమీపంలోని దళిత వాడ గ్రామస్థులు అధికారులను కోరా రు.
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.!
అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు బయటపెట్టింది కూటమి ప్రభుత్వం. ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు.
పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని, దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు కేబినెట్లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణల్లో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.