AP Cabinet meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:22 AM
AP Cabinet meeting: మంత్రిమండలి సమావేశం మంగళవారం నాడు జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు తన కేబినెట్‌తో చర్చించనున్నారు. అనంతరం పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇవాళ (మంగళవారం) కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు 24 అంశాల అజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశంలో చర్చించనుంది. సీఆర్డీఏ 46వ ఆధారిటీలో అమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఓకే చెప్పనుంది. ఐదో ఎస్ఐపీబీ సమావేశంలో అమోదించిన పెట్టుబడులపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులకు అమోదించనుంది. ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. నెల్లూరులో ఏపీఐఐసీకి, విజయనగరం జిల్లాలో గ్రే హౌండ్స్‌కు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కేబినెట్‌లో భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్‌లో ఈసారి ఉంచాలని మంత్రి మండలి భావించింది. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా బదిలీ కావడంతో ఈ సారి కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం.
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌పై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలపనుంది. ఈనెల 10వ తేదీన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏడు ఉమ్మడి జిల్లాల్లో సీనరేజ్ ఫీజు కాంట్రాక్టు ఎక్స్‌టెన్షన్‌కు కేబినెట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు సంబంధించి వివిధ ఉత్తర్వులకు రెటిఫికేషన్ ఇవ్వనుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో భూములు కేటాయింపును మంత్రిమండలి ఆమోదించనుంది. దీంతో 12 వేలమందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ. 617 కోట్లు, హైకోర్టు నిర్మాణానికి రూ.786 కోట్లు, ఎల్‌వన్ బిడ్డర్‌లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందజేసేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు అధికారాన్ని కట్టబెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్లైమేట్ గవర్నెన్స్ మెకానిజాన్ని అభివృద్ధి చేయడం క్లైమేట్ యాక్షన్ ప్లాన్, డేటా డ్రైవన్ ప్లానింగ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం స్టేట్ క్లైమేట్ సెంటర్‌ను మూడు నగరాల్లో ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. పలు గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులపై కేబినెట్ మాట్లాడనుంది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడిం పాలెంలో వంద బెడ్లతో ఈఎస్ఐ ఆస్పత్రికి స్టాఫ్ క్వార్టర్స్‌కు భూమి కేటాయింపులకు కేబినెట్‌లో ఇవాళ ఆమోదముద్ర వేయనుంది. ద్వారకా తిరుమల మండలం రాఘవాపురంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 30 ఎకరాలు భూమిని ఉచితంగా కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu Naidu: మళ్లీ అంబేడ్కర్ విదేశీ విద్య
Vontimitta Accident: అతి వేగం ఖరీదు మూడు ప్రాణాలు
Intermediate Results: ఇంటర్‌లో ‘ప్రభుత్వ’ టాపర్లకు నేడు సన్మానం
Read Latest AP News And Telugu News