Home » AP Govt
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. సీఎస్ చైర్మన్గా ఉన్న రాష్ట్ర కమిటీకి కీలక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా నియమితులయ్యారు
ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా ఏర్పాటైన 10 పట్టణాభివృద్ధి అథారిటీలకు అభివృద్ధి అనుమతులు ఇచ్చే అధికారాన్ని మళ్లీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిపివేసిన ఆ అనుమతులను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు
రేషన్ కార్డుదారులకు రాబోయే జూన్ నుంచి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా రేషన్లో రెండు కేజీలు రాగులు తీసుకునే అవకాశం లభించనుంది
మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు కేజీబీవీ పాఠశాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నాణ్యతలేని భోజనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
పంచాయతీరాజ్ శాఖలో ప్రక్షాళనకు శంకుస్థాపనగా ఉద్యోగుల కేడర్లో సమానతకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపీడీఓల నుంచి సీఈఓల వరకు క్రమబద్ధమైన పదోన్నతులు, శిక్షణ విధానం అమలులోకి వస్తున్నాయి
Railway Line Project: ఏపీకి కేంద్రం మరో శుభవార్త తెలిపింది. ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్లో ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్ట్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. అమరావతి రహదారులకు సంబంధించిన టెండర్లను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పిలిచింది.
Home Minister Anitha: ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి సాగు, స్మగ్లింగ్, కొనుగోలు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామని హెచ్చరించారు. ఫోక్సో కేసుల్లో బెయిల్ లేకుండా , శిక్ష పడేలా చూస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు.
Andhrapradesh Division Act: అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు రోడ్లు ఉపరితల రవాణాకు సంబంధించిన శాఖ త్వరిగతిని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన నిర్లక్ష్యంపై జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 15 లోగా విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు