AP NEWS: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ ప్రాజెక్ట్‌కు లైన్ క్లియర్
ABN , Publish Date - Apr 09 , 2025 | 07:11 PM
Railway Line Project: ఏపీకి కేంద్రం మరో శుభవార్త తెలిపింది. ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

అమరావతి: కేంద్ర కేబినెట్‌లో ఇవాళ(బుధవారం) పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో ప్రధానంగా ఏపీలోని రైల్వేలైన్ ప్రాజెక్టుపై మంత్రి మండలి సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు రైల్వేలైన్ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో రైల్వేలైన్ ప్రాజెక్టుకు రూ.1332 కోట్లు ఇస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి చిత్తూరులో తిరుపతి నుంచి తమిళనాడులోని వెల్లూరు జిల్లా కాట్పాడి వరకు రైల్వే లైన్ డబ్లింగ్‌కు నిధులు మంజూరు చేసింది. 113 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను డబ్లింగ్ చేయడానికి నిధులు మంజూరుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. తిరుపతి, పాకాల, కాట్పాడి రూట్‌లో మొత్తం 15 స్టేషన్ల పరిధిలో డబ్లింగ్ పనులు జరుగనున్నాయి. రెండో లైన్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాకు మార్గం సుగుమం కానుంది.
పలు రంగాలకు చేయూత: రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం: టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ, రైలు -రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తిరుపతి నుంచి పాకాల నుంచి కాట్పాడి రైల్వే లైన్‌ను డబుల్ ట్రాక్‌గా అభివృద్ధి చేయడానికి రూ.1,332 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు నవ్యాంధ్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఈ లైన్ డబ్లింగ్‌తో ఉత్తరాంధ్ర నుంచి తిరుపతికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే విద్యా, వైద్య అవసరాల కోసం వెల్లూరుకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడనుందని చెప్పారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యం కావడం ద్వారా పరిశ్రమల వృద్ధికి ఇది తోడ్పడనుందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ సిమెంట్, స్టీల్ రంగాలకు మరింత చేయూతనివ్వబోతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే పలు ప్రాంతీయ అభివృద్ధి పనులు వేగం పుంచుకుంటాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు డబుల్ ఇంజన్ పాలన విజయాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Trump China Tariffs: చైనాపై ట్రంప్ బాదుడు 104 శాతానికి!
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..
Big Shock To Kakani: కాకాణి బెయిల్.. నో చెప్పిన హైకోర్టు
Read Latest AP News And Telugu News