AIADMK-BJP Tie-up: కమలం పార్టీతో పొత్తుపై తేల్చిచెప్పిన పళనిస్వామి
ABN , Publish Date - Mar 26 , 2025 | 09:39 PM
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పళనిస్వామి, ఆ పార్టీ సీనియర్ నేతలు న్యూఢిల్లీలో మంగళవారంనాడు కలుసుకున్నారు. దీంతో పొత్తు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తమ సమావేశం వివరాలపై ఆయన క్లుప్తంగా మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన అంశాలపైనే తాము మాట్లాడామని చెప్పారు.

చెన్నై: వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ మళ్లీ పొత్తుపెట్టుకోనున్నాయనే ఉహాగానాలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి (Edappadi K Palaniswami) బుధవారంనాడు స్పందించారు. అవునని కానీ కాదని కానీ నేరుగా చెప్పకుండానే ఎన్నికల అవగాహనకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాలు ఇచ్చారు.
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పళనిస్వామి, ఆ పార్టీ సీనియర్ నేతలు న్యూఢిల్లీలో మంగళవారంనాడు కలుసుకున్నారు. దీంతో పొత్తు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తమ సమావేశం వివరాలపై ఆయన క్లుప్తంగా మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన అంశాలపై తాము మాట్లాడామని చెప్పారు. సమావేశంలో రాజకీయాల ప్రస్తావనపై అడిగనప్పుడు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని, ఇందుకోసం ఎలాంటి పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చినా దానిపై 2026 ఎన్నికల ముందు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని గతంలో చేసిన వ్యాఖ్యలపై అడిగినప్పుడు, భాగస్వామ్య పార్టీలను మార్చని పార్టీ ఒక్కటైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. తమకు పార్టీ సిద్ధాంతం, పొత్తులు అనేవి రెండు వేర్వేరు అంశాలనీ, సిద్ధాంతాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయని, పొత్తులనేవి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని అన్నారు. ఎన్నికలు దగ్గర పడినప్పుడు పొత్తులపై ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటామని, మీడియాకు కూడా తెలియజేస్తామని నవ్వుతూ చెప్పారు. అయితే ఒకటి మాత్రం స్పష్టమని, డీఎంకేనే తమ ప్రత్యర్థి అని, 2026 ఎన్నికల్లో డీఎంకేను ఓడించడమే తమ ఏకైక లక్ష్యమని పళని స్వామి చెప్పారు.
ఇవి కూడా చదవండి..