Home » Bail
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ముందస్తు విడుదల కోసం పిటిషన్లలో న్యాయవాదులు తప్పుడు సమాచారం ఇస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.
లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.
ఆరు నెలల అనంతరం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
ఇంజనీర్ రషీద్‌ను టెర్రర్ ఫండింగ్ కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. 2019 నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు.
పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ నాయకుడు సయాన్ లాహిరి బెయిల్‌ను సవాల్ చేస్తూ బెంగాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుమారు 100 రోజుల పాటు జైలులో కుమార్ ఉన్నారు.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో 'ఆమ్ ఆద్మీ పార్టీ' మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్ కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో 23 నెలలుగా తీహార్ జైలులో ఉన్న నాయర్‌కు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..
పలు ఆర్థిక నేరాలపై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు ఒక కేసులో బెయిల్ మంజూరు చేసింది. అన్నాడీఎంకే 'రెండాకుల' ఎన్నికల గుర్తుకు సంబంధించిన ముడుపుల కేసులో ఆయనకు కోర్టు బెయిలు ఇచ్చింది.