Home » Bengaluru News
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Mysore Urban Development Authority) పరిధిలో నివేశనం స్థళాల పంపిణీకి సంబంధించి ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరపలేదని రాయచూరు ఎంపీ, అప్పటి మైసూరు జిల్లాధికారి జీ కుమార్ నాయక్(G Kumar Nayak) తెలిపారు.
గడచిన నెల రోజులుగా ప్రజలను ముఖ్యంగా పశువుల యజమానులను, గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేసిన చిరుత(Leopard) బోనుకు చిక్కింది. రాయచూరు(Rayachuru) నగర సమీపం మలియాబాద్ అటవి ప్రాంతంలోని పలు సార్లు జంతువుల పై దాడి చేసి ఆవులు, మేకలు ఇతర వాటిని వేటాడి తిన్న చిరుత అటవి శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బంధిగా పట్టుబడింది.
బెంగళూరు నుంచి ప్రతిరోజూ సంచరించే సత్యసాయి, ధర్మవరం మెము రైలు(Sathya Sai, Dharmavaram MEMU train) మంగళవారం నుంచి రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు.
వీసాల పేరుతో రూ.కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ దేశాలకు వెళ్లేందుకు వీసాలు సమకూరుస్తామని నమ్మించి 51మంది నుంచి రూ.2 కోట్లకు పైగా వసూళ్లు చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్(City Police Commissioner Dayanand) పేర్కొన్నారు.
నగరంలో ఓ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. బళ్లారి(Ballari) నగరంలోని గ్లాస్ బజార్లో నివాసం ఉండే శంకర్రావు (40) తన భార్య శాంతిదేవి(34)ని హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ భిక్షతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(Vijayendra) ఎమ్మెల్యే అయ్యారని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) తీవ్రంగా వ్యాఖ్యానించారు. నగరంలో శుక్రవారం ఓ కార్యక్రమంలో డీసీఎం డీకే శివకుమార్ మాట్లాడిన వేళ ఇప్పుడు పదవి వచ్చిందని విజయేంద్ర అన్నా అంటూ పిలుస్తారని, అతడు ఎమ్మెల్యే కావడం కాంగ్రెస్ భిక్ష అన్నారు.
గంగావతి తాలూకా సణాపుర గ్రామం వద్ద తుంగభద్ర నది(Tungabhadra River)లో ఈతకని వెళ్ళి నదిలో కొట్టుకుని పోయిన హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు అనన్యరావు(26) మృత దేహాన్ని ఎట్టకేలకు గురువారం రక్షణ సిబ్బంది గుర్తించారు.
చిక్కమగళూరు(Chikmagalur) తాలూకా దాసరహళ్ళిలో ఇద్దరి మృతికి సంబంధించి పోలీసులు వాస్తవాలను వెలికి తీశారు. హైస్కూల్ టీచర్ను హత్య చేసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు.
రాష్ట్రంలో నందిని బ్రాండ్ పాల(Nandini brand milk) ధర పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమర్పించిన వెంటనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) కూడా పాల ధర పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అత్తా కోడళ్ల పంచాయితీకి సంబంధించిన వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కోడలిని చిత్రహింసలు పెడుతున్న అత్త.. అత్తపై దాడి చేసిన కోడలు.. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి.