MP: ఆ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:27 PM
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Mysore Urban Development Authority) పరిధిలో నివేశనం స్థళాల పంపిణీకి సంబంధించి ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరపలేదని రాయచూరు ఎంపీ, అప్పటి మైసూరు జిల్లాధికారి జీ కుమార్ నాయక్(G Kumar Nayak) తెలిపారు.

- ఎంపీ కుమార్‌నాయక్
రాయచూరు(బెంగళూరు): మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Mysore Urban Development Authority) పరిధిలో నివేశనం స్థళాల పంపిణీకి సంబంధించి ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరపలేదని రాయచూరు ఎంపీ, అప్పటి మైసూరు జిల్లాధికారి జీ కుమార్ నాయక్(G Kumar Nayak) తెలిపారు. ప్రస్తుతం లోకాయుక్త అధికారులు జరుపుతున్న ఎలాంటి విచారణకైన తాను సిద్ధమేనని అన్ని వివరాలు ఇప్పటికే లోకాయుక్త విచారణ అధికారులకు తెలియజేశానన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Leopard: ఎట్టకేలకు ‘చిరుత’ చిక్కిందోచ్..
మంగళవారం నగరంలోని తనను కలిసిన విలేఖరులతో మాట్లాడిన కుమార్ నాయక్, ఇటీవల లోకాయుక్త అధికారులు ఇచ్చిన నివేదిక అంశాలను తాను ఇంకా చూడలేదని పూర్తి వివరాలు అందిన అనంతరం అన్ని వివరాలతో మాట్లాడగలనన్నారు. అప్పటి జిల్లాధికారిగా తాను తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిబంధనల మేరకు నివేశన స్థళాల పంపిణీకి ఆదేశాలు ఇచ్చామని ఇందులు ఎలాంటి రాజకీయ ఒత్తిడులు దురుద్దేశాలు అవినీతికి తావివ్వలేదని కుమార్ నాయక్ స్పష్టం చేశారు.
ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్?
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
Read Latest Telangana News and National News