Home » Bengaluru
Ranya Rao: కన్నడ నటి రన్యారావు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నటుడు తరుణ్ రాజ్ కొండూరుతో ఆమె దుబాయి కేంద్రంగా ఈ స్కాం నడిపినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
లక్కీ బాస్కర్ సినిమా స్పూర్తితో ఓ లేడీ బ్యాంకు మేనేజర్ మోసానికి పాల్పడింది. పక్కాప్లాన్తో పని ముగించింది. కానీ, సినిమా వేరు, జీవితం వేరు కాబట్టి.. పాపం పండి అడ్డంగా బుక్కయింది.
కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా ఉన్న కె.రామచంద్రరావును 'కంపల్సర్సీ లీవు'పై పంపుతూ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. తక్షణం ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు.
దుర్గాడ సిరి హోటల్ వద్ద కొందరు వ్యక్తులు అర్థరాత్రి సమయంలో గుమిగూడారు. దీంతో అటువైపు వెళ్తున్న పోలీసు వాహనం అక్కడ ఆగింది. అక్కడి నుంచి అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సబ్ ఇన్స్పెక్టర్ గాడిలింగ గౌడర్ కోరారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు కుమార్తె అయిన రన్యారావును బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఇటీవల అడ్డుకుని, రూ.12.56 కోట్లు విలువచేసే అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్ముతున్న యువకుడిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా అతడి వద్ద నుంచి 6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
రన్యారావు బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రోటాకాల్ను దుర్వినియోగం చేశారని, తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పేరును ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
డీఆర్ఐ ఇంటరాగేషన్లో తనపై శారీరకంగా ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని రన్యారావు కోర్టుకు స్పష్టం చేశారు. అయితే మాటలతో వేధించడం, బెదిరించడం జరిగిందని, దాంతో తాను భావోద్యేగానికి గురయ్యానని చెబుతూ కోర్టులో ఆమె కంటతడి పెట్టారు.
ఈ కేసులో గత శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరచడానికి ముందు కూడా ఆమె తన లాయర్ల వద్ద కంటతడిపెట్టారు. అసలు ఈ కేసులో తాను ఎలా ఇరుక్కున్నానో, విమానాశ్రయం వద్ద ఏమి జరిగిందో తలుచుకుంటూ తాను నిద్రపోలేదని, మానసిక స్థిమితం కోల్పోయానని చెప్పింది.
అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది.దర్యాప్తులో భాగంగా రెండు టీమ్లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది. రన్యారావుపై సీబీఐ కేసు నమోదు చేసింది.