Home » Bhadrachalam
ప్రసవ వేదనతో ఓ గర్భిణి ఆస్పత్రి రావడం.. అక్కడ సర్జన్ అందుబాటులోలేకపోవడంతో స్వయంగా వైద్యుడైన స్థానిక ఎమ్మెల్యేనే సిజేరియన్ చేసి బిడ్డను కుటుంబసభ్యుల చేతుల్లో పెట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 51.10 అడుగుల వద్ద 13,18,860 క్యూసెక్కుల వరద ఉధృతి పెరిగింది. 53 అడుగులు దాటగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నది ప్రవాహం 50.6 అడుగులకు చేరడంతో సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ వద్ద ఏకంగా 9 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు కృష్ణా బేసిన్లోని శ్రీశైలానికి భారీ వరద వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాల గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా శనివారం 17 గేట్లను ఎత్తారు. 1,04,416 క్యూసెక్కులను దిగువకు వదిలారు.
ఒకవైపు ఎడతెరిపి లేని వర్షం.. మరోవైపు ఆకస్మికంగా వచ్చి పడిన వరద.. ఇంతలో మొరాయించిన ప్రాజెక్టు గేటు.. కట్టకు గండ్లు.. దాని పైనుంచి ప్రవాహం.. ఏ క్షణంలోనైనా తెగి ఊళ్లు మునిగే ప్రమాదం..! మధ్యలో చిక్కుకుపోయిన ప్రజలు..!
హైదరాబాద్: వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిన్నారు.
దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలం (Bhadrachalam)లో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)ను కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
భద్రాద్రిలో కొలువైన శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం భక్తులకు లభించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా భద్రాచలంలోనూ బ్రేక్ దర్శనం భక్తులకు కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేటి నుంచే ఈ బ్రేక్ దర్శన అవకాశాన్ని కల్పించనున్నారు.
భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆంఽధ్రప్రదేశ్ను కోరతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన చట్టం హామీల అమలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై జరిగే ఉమ్మడి చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు.