Home » Bhatti Vikramarka
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్తు విధానాన్ని తీసుకురాబోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని.. పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ అశోక హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, గౌరవ గొగోయ్ సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. సీడబ్ల్యుసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, హిమాచల్ సీఎం సుక్విందర్ సింగ్ సుకు, ఏపీ నుంచి రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా భవన్లో బాంబ్ ఉందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.
ఒకప్పుడు బ్రూ కాఫీ గురించి విన్నామని.. ఇప్పుడు రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ గురించి వింటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో భట్టి, రేవంత్, ఉత్తమ్(బీఆర్ఎయూ) ట్యాక్స్ మొదలైందని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
Telangana: జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడంతో తన జన్మదన్యమైందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి.. వాళ్లను బానిసలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
రిజర్వేషన్లు ఎత్తివేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. నేడు ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందన్నారు. ‘సంపద పెంచుతాం.. పంచుతాం’ ఇదే కాంగ్రెస్ నినాదమని తెలిపారు. కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇవ్వగానే బీజేపీ కుట్రలు మొదలు పెట్టిందని భట్టి విమర్శించారు.
Telangana: పదేళ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కూసుమంచిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయని ఆయన ఈరోజు మాట్లాడుతున్నారన్నారు.
చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద నలుగుతున్న మూడు స్థానాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేటికీ పెండింగ్లో పెట్టింది. ఆయా స్థానాల్లో కీలక నేతలు తమ వారికి కావాలంటే తమ వారికి కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నారు.