Share News

Bhuma Akhila Priya: ఒక్క చాన్స్ ఇస్తే జగన్.. రోడ్డు పాల్జేశారు.. భూమా అఖిలప్రియ విసుర్లు

ABN , Publish Date - Nov 01 , 2024 | 09:06 PM

విదేశాల నుంచి పరిశ్రమలు తెచ్చి ఏపీని అభివృద్ధి చేయడానికి అటు సీఎం చంద్రబాబు.. ఇటు మంత్రి నారా లోకేష్ ఎంతో కష్ట పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆబద్ధపు మాటలకే పరిమితమైందని భూమా అఖిలప్రియ మండిపడ్డారు.

Bhuma Akhila Priya: ఒక్క చాన్స్ ఇస్తే జగన్..  రోడ్డు పాల్జేశారు..   భూమా అఖిలప్రియ విసుర్లు

నంద్యాల: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని గతంలో నమ్మి ఒక్క చాన్స్ ఇస్తే ప్రజలను రోడ్డు పాల్జేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డలో దీపం పథకం 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ...ప్రజలు ఎన్డీఏ కూటమిని నమ్మి ఓట్లేశారని.. వారికి మనం పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆబద్ధాలకే పరిమితమైందని భూమా అఖిలప్రియ విమర్శలు చేశారు.


విదేశాల నుంచి పరిశ్రమలు తెచ్చి ఏపీని అభివృద్ధి చేయడానికి అటు సీఎం చంద్రబాబు.. ఇటు మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ‘‘నా తల్లి శోభా నాగిరెడ్డి పుట్టినరోజు నాడే ఆళ్లగడ్డలో ఓ నూతన పరిశ్రమను మొదలు పెట్టబోతున్నాం. ఈ పరిశ్రమ ద్వారా 2000 వేలమది మహిళలకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం’’ అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడించారు.


వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం సన్నగిల్లింది: ఎమ్మెల్యే గణబాబు

విశాఖపట్నం( గోపాలపట్నం): వైసీపీ పార్టీలో ఉండే నేతలకు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం సన్నగిల్లిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. దీపం పథకం కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళా లబ్ధిదారులకు ఎమ్మెల్యే గణబాబు అందజేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమమని ఎమ్మెల్యే గణబాబు చెప్పారు..


కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సహకారం, జనసేన యువ నాయకుల సహకారంతో అన్ని కలబోసి ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. పేదలకు ఉపయోగపడే విధంగా సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కొనసాగాలంటే రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాలను దృష్టి పెడుతూ నిరంతర శ్రామికుడిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉండే పరిస్థితులను చక్కబట్టలేని నాయకుడు రాష్ట్రాన్ని ఏవిధంగా ఈరోజు పరిపాలన చేశారో ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు.జగన్ రెడ్డి స్వార్థపూరిత ఆలోచనలు ఈరోజు బయటపడ్డాయని ఎమ్మెల్యే గణబాబు విమర్శలు చేశారు.

Updated Date - Nov 01 , 2024 | 09:11 PM