Home » BRS Chief KCR
తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని జన సమితి అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండ రాం (Kodandaram) తెలిపారు.మొట్ట మొదటి సారిగా తమను ఆవిర్భావంతో ఈ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ ఆహ్వానం దొరకలేదని అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్కు (KCR) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ఆహ్వాన లేఖ రాశారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ కేసీఆర్కు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో జరిగిన బెయిల్ విచారణలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ మారుతారని.. ఆయనకు అనుకూలంగా ఉండే బీజేపీలోకి వెళ్తారని బీఆర్ఎప్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరోపణలు చేశారు.
రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ (Congress) కిసాన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ మొదట సన్నాలు వేయమన్నారని.. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అనలేదా అని సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అనుబంధ పేపర్లో కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం చూసి బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్.ఆర్.కన్వెన్షన్లో నియోజక వర్గ సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని.. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) పోలింగ్ సరళిపై బీఆర్ఎస్ (BRS) కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ గాలి వీచిందన్నారు. రియాలిటీనీ దాచాల్సిన అవసరం లేదని చెప్పారు.