TG Politics: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. కేసీఆర్‌కు ఆహ్వానం
ABN , Publish Date - May 30 , 2024 | 07:46 PM
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ఆహ్వాన లేఖ రాశారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు.
హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ఆహ్వాన లేఖ రాశారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. లేఖను స్వయంగా కేసీఆర్‌కు అందించాలని ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ ఇన్‌చార్జ్, హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌లకు బాధ్యతలు అప్పగించారు.
కేసీఆర్‌ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో అధికారులు చర్చలు జరిపారు. కేసీఆర్ గజ్వేల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారని ఆయన సిబ్బంది తెలిపారు. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Politics: అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
Telangana: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా.. ఎందుకంటే..?
BJP: ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న బీజేపీ
New Logo: ఖరారైన తెలంగాణ కొత్త లోగో..!
Read Latest Telangana News and Telugu News