Share News

KTR: మాకు ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 01 , 2024 | 09:33 PM

తెలంగాణలో 4వ విడత లోక్‌సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు మెజారిటీ సర్వేలు ''ఎగ్జిట్ పోల్స్'' (Exit polls) ఫలితాలు తెలిపాయి.

KTR: మాకు ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
KTR

హైదరాబాద్: తెలంగాణలో 4వ విడత లోక్‌సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు మెజారిటీ సర్వేలు ''ఎగ్జిట్ పోల్స్'' (Exit polls) ఫలితాలు ప్రకటించాయి. అయితే ఈ ఫలితాలు మరింత ఆసక్తిని రేపాయి. ఈ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేదని.. ఎగ్జాక్ట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోమని కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

అనంతరం తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...తెలంగాణ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ కోసం అసువులు భాసిన అమరులకు కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ నేతలదంరూ నివాళులు అర్పించామని అన్నారు.అమరులను స్మరించుకుంటూ గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు.ర్యాలీకి సబ్బండ వర్గాలు తరలివచ్చాయని చెప్పారు.


కాగా.. తెలంగాణ దశాబ్ది ఉత్సావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. 10 ఏళ్లుగా అధికార పార్టీ హోదాలో వేడుకలు నిర్వహించగా.. రాష్ట్రావిర్భావం తర్వాత తొలిసారి ప్రతిపక్షా హోదాలో బీఆర్ఎస్ ఈ కార్యక్రమం జరుపుతోంది. ఈ సందర్భంగా గులాబీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు కేటీ రామారావు, హరీశ్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళి అర్పించారు.


కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ కీలక నేతలు అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం గన్ పార్క్ నుంచి సచివాలయం వద్ద ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం వరకు క్యాండిల్ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి వస్తుండగానే కేసీఆర్ లక్డీకపూల్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Updated Date - Jun 01 , 2024 | 10:01 PM