Home » Budget 2024
PM Narendra Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు.
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను మరొక రోజు అదనంగా పొడిగించే అవకాశం ఉంది. అయితే, దీనికి ఇతమిద్ధమైన కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ప్రారంభమైన 10 రోజుల బడ్జెట్ సమావేశాలు ఈనెల 9వ తేదీతో ముగియనున్నాయి. అయితే, వచ్చే శనివారం (10వ తేదీ) వరకూ సమావేశాలను పొడిగించే విషయంపై చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ మంత్రిగా ఉండటానికి తగరని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో మంగళవారంనాడు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఎంపీ వ్యాఖ్యలు దళిత వర్గాన్ని అవమానించేలా ఉన్నాయంటూ అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టంపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా ఈ గందరగోళం చెలరేగింది.
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకే చెందిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పైన పవర్‌ఫుల్ పంచ్‌లు విసిరారు. భారతీయులు సోమరులనే అభిప్రాయంతో పండిట్ నెహ్రూ ఉండేవారని అన్నారు.
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై నిప్పులు కక్కారు. విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలపై పవర్‌ఫుల్ పంచ్ విసిరారు. ''దేశాన్ని దోచుకున్న వారు మూల్యం చెల్లించాల్సిందే'' అని హెచ్చరించారు.
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మూడో టర్మ్‌లోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా సరసన భారత్‌ను నిలిపే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, మూడో స్థానంలోకి తీసుకువెళ్లడం తమ విజన్ అని స్పష్టం చేశారు.
వంద రోజుల్లో మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
PM Narendra Modi: విపక్షాలు చాలాకాలం ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నాయని.. అందుకు విపక్షాలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. లోక్ సభ ఎన్నికల ముందు వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 బడ్జెట్‌ని ఆమె గురువారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికంటే ముందు..
ఎన్నికల ముందు మరో ‘బడ్జెట్ బండి’ దూసుకొచ్చింది. ‘ఓటాన్’ బడ్జెట్ కాస్తా మధ్యంతర బడ్జెట్‌గా మారిపోయింది. పదేళ్ల ‘ప్రగతి’పై వివరణ! వరాలూ... వడ్డింపులు లేకుండా... అందమైన భవిష్యత్ వర్ణనతో బడ్జెట్ కథా చిత్రం రక్తి కట్టింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక ప్రకటనలు