Share News

PM Modi: 30 ఏళ్లు అక్కర్లేదు...మూడో టర్మ్‌లో మూడో స్థానంలో భారత్

ABN , Publish Date - Feb 05 , 2024 | 07:42 PM

కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మూడో టర్మ్‌లోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా సరసన భారత్‌ను నిలిపే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, మూడో స్థానంలోకి తీసుకువెళ్లడం తమ విజన్ అని స్పష్టం చేశారు.

PM Modi: 30 ఏళ్లు అక్కర్లేదు...మూడో టర్మ్‌లో మూడో స్థానంలో భారత్

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. మూడో టర్మ్‌లోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా సరసన భారత్‌ను నిలిపే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, మూడో స్థానంలోకి తీసుకువెళ్లడం తమ విజన్ అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మోదీ సమాధానమిస్తూ, పదేళ్ల పాలనానుభవం వల్లే ఇవాల్టి పటిష్ట ఆర్థిక వ్యవస్థ, వేగవంతమైన దేశ ప్రగతి సాధ్యమైందన్నారు. మూడో టర్మ్‌లో ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని ధీమాగా చెప్పగలనని అన్నారు. ఇది మోదీ గ్యారెంటీ అని ఆయన అన్నారు.


''2014లో ఇండియా 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈరోజు 5వ స్థానానికి చేర్చాం. అయినప్పటికీ కాంగ్రెస్ మౌనంగానే ఉంది. వాళ్లు కనీసం కలలుగనే సామర్థ్యాన్ని కూడా కోల్పోయారు. ఈసారి నేను హామీ ఇస్తున్నాను. దేశ ప్రజలు మరో 30 ఏళ్ల వరకూ ఆగనవసరం లేదు. మా మూడో టర్మ్‌లోనే ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతాం'' అని మోదీ స్పష్టం చేశారు.

Updated Date - Feb 05 , 2024 | 07:42 PM